యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. ఐతే సరైన విజయాలు లేకపోయినా నితిన్ లైనప్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ఓకే చేసి పెట్టుకున్నాడు. ‘రాబిన్ హుడ్’ వచ్చిన రెండు నెలలకే వేణు శ్రీరామ్ సినిమా ‘తమ్ముడు’ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాను చేయబోయే మిగతా చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు నితిన్.
తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో విక్రమ్ కుమార్ సినిమా చాలా స్పెషల్ అని అతను చెప్పాడు. ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి వస్తే టాలీవుడ్ గర్వించే మూవీ అవుతుందని అతను వ్యాఖ్యానించడం విశేషం. ‘‘తమ్ముడు సినిమా రెగ్యులర్ మాస్ మూవీ కాదు. అందులో చాలా విశేషాలు ఉన్నాయి. దాని ట్రైలర్ రిలీజైతే అది ఏ రేంజ్ మూవీ అన్నది అర్థమవుతుంది. అది పూర్తి కావచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాగానే వేణు దర్శకత్వంలో చేయబోతున్న ‘యల్లమ్మ’ సినిమాను మొదలుపెడతాం. దాని గురించి కూడా ఇప్పుడేమీ చెప్పను. అది చాలా ప్రత్యేకమైన చిత్రం.
దీంతో పాటుగా విక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టాల్సి ఉంది. కానీ దానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ చిత్రమిది. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. చాలా పెద్ద బడ్జెట్ అవుతుంది. విజువల్‌గా ఇంతకుముందు ఎన్నడూ చూడనిది ఈ సినిమాలో చూస్తాం. విక్రమ్ నాకు ఏం చెప్పాడో అది స్క్రీన్ మీదికి తీసుకురాగలిగితే తెలుగు వాళ్లు గర్వించే సినిమా అవుతుంది. దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అది పూర్తి చేయడానికి కూడా చాలా టైం పడుతుంది’’ అని నితిన్ వెల్లడించాడు.
This post was last modified on March 21, 2025 5:21 pm
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…