ఒక క్రికెటర్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు ఎంత పేరుందో మన తెలుగు సినిమాల పాటలకు డాన్సు రీల్స్ చేయడం ద్వారా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 1 టైంలో తన వీడియోలు మాములు వైరల్ కాలేదు. అందుకే ఈసారి ఏకంగా టాలీవుడ్ తెరమీదకు తీసుకొస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ లో వార్నర్ నటించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎపిసోడ్ కాదు కానీ ఒక ముఖ్యమైన సీన్లో నటించినందుకు గాను అతనికి రెండున్నర కోట్లు ఇచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఇది ఒక టయర్ 3 సోలో హీరో రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ. ట్విస్ట్ ఏంటంటే ఈసారి ఐపీఎల్ లో అతన్ని ఎవరూ కొనలేదు.
సరే ఇంత ఖర్చు పెట్టాం కదా గిట్టుబాటు అయితే చాలనేది నిర్మాతల ఉద్దేశం. అయితే ఫ్యాన్స్ ఎక్కువ ఊహించుకునేలా డేవిడ్ వార్నర్ పాత్ర ఉండదని ఇన్ సైడ్ టాక్. తక్కువ డైలాగులతో జస్ట్ కాసేపు కనిపించి వెళ్లిపోయేలా దర్శకుడు వెంకీ కుడుముల ఆ పాత్రని డిజైన్ చేసినట్టు సమాచారం. ఆ మధ్య రాజమౌళి నటించిన ఒక క్రెడిట్ కార్డు ప్రకటనలో వార్నర్ ను వాడుకున్నారు కదా. అచ్చం అదే స్టైల్ లో ఉంటుందట. అయితే గతంలోలా వార్నర్ కు అంత ఫాలోయింగ్ ఇప్పుడు లేదు. ట్రావిస్ హెడ్, విలియంసన్, రచిన్ రవీంద్ర, కమిన్స్ తో పోలిస్తే మనోడు బాగా వెనుకబడ్డాడు. క్రికెట్ ఫామ్ కూడా బాగా తగ్గిపోయింది.
సో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాకుండా డేవిడ్ వార్నర్ ని జస్ట్ ఎంజాయ్ కోణంలోనే మాత్రమే చూడాలని టీమ్ ఆశిస్తోంది. మార్చి 28 విడుదలకు రెడీ అవుతున్న రాబిన్ హుడ్ మీద ప్రమోషన్ల వల్ల మంచి బజ్ వచ్చేసింది. ఇంకా ట్రైలర్ బాకీ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా నితిన్ కెరీర్ లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2, మ్యాడ్ స్క్వేర్ తో పోటీ పడుతున్న రాబిన్ హుడ్ బాక్సాఫీస్ కు కొత్త జోష్ తీసుకొస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on March 21, 2025 1:18 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…