సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటిసారి థియేట్రికల్ రిలీజయ్యింది 2023 డిసెంబర్లో. అంటే కేవలం పదిహేను నెలలు మాత్రమే అయ్యింది. ఇంత తక్కువ గ్యాప్ లో రీ రిలీజ్ అంటే సహజంగా ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. ఎంత ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళ హడావిడి ఒక్క షోకు పరిమితమవుతుంది. కానీ సలార్ కొత్త ట్రెండ్ ని సృష్టించే దిశగా పరుగులు పెడుతోంది. ఇవాళ రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ లోనే కోటిన్నర పైగా గ్రాస్ వసూలు చేయడం చిన్న విషయం కాదు. మెయిన్ సెంటర్స్ లో ఉదయం, సాయంత్రం షోలు దాదాపు ఫుల్సే.
ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 200 పైగా సింగల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ షోలు సలార్ కు ఇచ్చారు. ఒకపక్క తొమ్మిదికి పైగా కొత్త సినిమాలు, ఇంకోవైపు కోర్ట్ స్ట్రాంగ్ రన్ జరుగుతున్నా కూడా ఇంత కేటాయింపు జరగడం ఒక్క ప్రభాస్ కే సాధ్యమేమో. ఈ స్పీడ్ ఆదివారం వరకు కొనసాగేలా ఉంది. భ్రమరాంబ థియేటర్ కు ఫ్యాన్స్ మూడు టన్నుల పేపర్లు కత్తిరించి తీసుకెళ్లారంటే సంబరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో సలార్ హిందీ వెర్షన్ ఏకంగా ఏడాదికి పైగా టాప్ ట్రెండింగ్ లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నెట్ ఫ్లిక్స్ లోనూ మైలురాళ్ళున్నాయి.
నిజానికి సలార్ పార్ట్ 1 బాహుబలి, కెజిఎఫ్ ని దాటలేదు. అంతెందుకు పుష్ప 2 స్థాయి దూకుడులో సగం కూడా లేదు. ఏడెనిమిది వందల కోట్లు వసూలు చేసినా కూడా ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు ఇంకా పెద్దగా ఆడాల్సిందని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ రన్ ఏమో కానీ రిపీట్ రన్ లో మాత్రం సలార్ సెన్సేషన్లు ఆగేలా లేవు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో కమర్షియల్ సాంగ్స్ ఉండవు. ఉన్న రెండు ఎమోషనల్ పాటలే. ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుంది. ఇంటర్వెల్ బాంగ్, బొగ్గుగని ఎపిసోడ్, కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ప్రధానంగా ఈ నాలుగింటికే మూవీ లవర్స్ వెర్రెక్కిపోయి సలార్ ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.
This post was last modified on March 21, 2025 2:31 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…