టాలీవుడ్ లో ప్రస్తుతమున్న వాటిలో మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ గా చెప్పుకునే వాటిలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ముందు వరుసలో ఉంది. వేగంగా సినిమాలు తీయడమే కాదు సక్సెస్ రేట్ కూడా ఘనంగా కొనసాగిస్తున్న ఈ నిర్మాణ సంస్థను నిర్మాత నాగవంశీ నడిపిస్తున్న తీరు వరస హిట్లను ఇస్తోంది. మార్చి 28 మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది. రాబిన్ హుడ్, ఎల్2 ఎంపురాన్, వీరధీరశూర పార్ట్ 2తో పోటీ చాలా టఫ్ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ముందుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా జర్నలిస్టులతో కాకుండా సినిమాలో నటించిన హీరోతో వెరైటీ ఇంటర్వ్యూ చేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.
సితార 50వ సినిమాకు దగ్గరలో ఉంది. ఏ బ్యానర్ కైనా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నెంబర్. అందుకే బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా క్రేజీ మూవీ తీయాలని ప్లాన్ చేసుకుంటారు. ఇదే ప్రస్తావన సంగీత్ శోభన్ తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరితో ఒకరితో మాత్రమే 50వ మూవీ తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారనేది ప్రశ్న. దానికి నాగవంశీ సమాధానమిస్తూ పవన్ ఉన్న స్థాయికి ఇకపై రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారు, ఇంకా పెద్ద పొజిషన్లకు ఎప్పుడు వెళ్తారు అని కోరుకోవాలి తప్పించి సినిమా తీయాలని కాదని, అలా ఛాయస్ పెట్టుకుంటే తారక్ కే ప్రాధాన్యం అంటూ కుండ బద్దలు కొట్టారు.
నాగవంశీ చెప్పింది చాలా ప్రాక్టికల్ యాంగిల్. ఎందుకంటే పవన్ బాలన్స్ ఉన్న మూడు సినిమాలకు డేట్లు ఇవ్వడానికే టైం చాలక ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు కొత్త కమిట్ మెంట్స్ అంటే జరగని పని. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పని భారం చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు. డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలకు బాధ్యులుగా ఉంటూ జనసేనని మరింత బలోపేతం చేసే బాధ్యతతో ఉన్నారు. సో సితార ప్రెస్టీజియస్ మూవీకి పవన్ కళ్యాణ్ కన్నా జూనియర్ ఎన్టీఆరే బెటర్ ఛాయస్ అవుతాడని ఆయన అన్న మాటకు ఎవరి అభిమాని అయినా రైటనే అంటారు.
This post was last modified on March 20, 2025 8:08 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…