రాజకీయాలకు-సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్‌తో ప్రారంభమైన సినీ రాజకీయాలు.. నిన్న మొన్నటి వరకు సాగుతూనే ఉన్నాయి. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా రాజకీయాలు చేశారు. తమ పేరును చాటుకున్నారు. దాసరి నారాయణరావు, కృష్ణ, రామానాయుడు, శారద ఇలా చాలా మంది రాజకీయ అరంగేట్రం చేసి తమ సత్తా చాటారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒకప్పుడు టాలీవుడ్ కోసం రాజకీయ నాయకులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు టాలీవుడ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పైగా.. నటులు నిర్మాతలు కూడా.. వెనక్కి తగ్గు తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీలో, అటు తెలంగాణలో కూడా టాలీవుడ్ నుంచి ఇప్పుడు రాజకీయాలపై సందడి తగ్గిందనే చెప్పాలి. ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయడం.. మరో పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు, దర్శకులు, నిర్మాతల పరిస్థితి మార్పుచెందుతోంది.
వేధింపులు, కక్ష సాధింపులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్నాయన్నది టాలీవుడ్ చెబుతున్న మాట. తాజాగా అంతర్గత సమావేశంలో తెలంగాణ సినీ ఇండస్ట్రీ ఇదే అభిప్రాయం వెల్లడించింది. గతంలో బీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు దర్శకులు ఇప్పుడు సినిమాలు తీసుకునేందుకు లొకేషన్లు లభించని పరిస్థితి ఏర్పడడంతో అత్యంత రహస్యంగా ఈ భేటీ నిర్వహించారు. అలాగని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే.. మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే.. తమ పరిస్థితి ఏంటని వారు తల్లడిల్లుతున్నారు.
ఇక, ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా తటస్థంగా మారుతున్నారు. వైసీపీని సమర్ధించిన నటులు, దర్శకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో అసలు రాజకీయాలు ఎందుకు? అనే ధోరణి టాలీవుడ్‌లో పెరిగిపోయింది. ఇదిలావుంటే.. గతంలో మాదిరిగా.. నటులు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓటేస్తారన్న సంస్కృతి కూడా పోయింది. దీంతో టాలీవుడ్ దాదాపు రాజకీయాలకు స్వస్తి చెప్పే దిశగానే అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on March 20, 2025 4:54 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…