గత వారం కోర్ట్ రూపంలో ఒక చిన్న సినిమాకు పెద్ద విజయం దక్కడం చూసి బాక్సాఫీస్ హ్యాపీగా ఉంది. ఎంత నిర్మాత నాని అయినప్పటికీ కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించే ట్రెండ్ లో ఎక్కువ శాతం కొత్తవాళ్లు నటించిన సీరియస్ డ్రామాకు వారం తిరక్కుండానే ముప్పై కోట్ల వసూళ్లు దాటడం చిన్న విషయం కాదు. ఈ నేపథ్యంలో రేపు మార్చి 21 ఏకంగా ఏడుకి పైగా చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. కమెడియన్ సప్తగిరి ‘పెళ్లి కాని ప్రసాద్’కి ప్రమోషన్లు బాగానే జరిగాయి. కంటెంట్ మీద నమ్మకంతో ఇవాళ హైదరాబాద్ లో మూడు ప్రీమియర్లు వేస్తున్నారు.
ఈ మధ్య కనిపించడం తగ్గించిన ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’గా వస్తున్నాడు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి పెద్దగా పబ్లిసిటీ చేస్తున్న దాఖలాలు లేవు. దర్శక నిర్మాతలు మాత్రం హిట్టు పట్ల ధీమాగా ఉన్నారు. కోర్ట్ తో పేరు తెచ్చుకున్న హర్ష్ రోషన్ ఒక ప్రధాన పాత్ర పోషించిన ‘టుక్ టుక్’ ఏదో వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందింది. టాక్ బాగుంటే జనాన్ని ఆశించవచ్చు. విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ‘అనగనగా ఆస్ట్రేలియా’ రేపే వస్తోంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మరో రెండు చిత్రాలు ఆర్టిస్ట్, ది సస్పెక్ట్ బరిలో ఉన్నాయి. వెరైటీ టైటిల్ పెట్టుకున్న బాలీవుడ్ డబ్బింగ్ ‘కిస్ కిస్ కిసిక్’కి హడావిడి చేస్తున్నారు..
ఇవి కాకుండా రెండు రీ రిలీజులు వస్తున్నాయి. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఎవడే సుబ్రమణ్యం’కు మరోసారి ఆదరణ దక్కుతుందనే నమ్మకం వైజయంతి మూవీస్ టీమ్ లో ఉంది. రెండేళ్లు తిరక్కుండానే తీసుకొస్తున్నా ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ బుకింగ్స్ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అడ్వాన్స్ లోనే కోటి రూపాయలు గ్రాస్ దాటడం రికార్డే. వీటితో పాటు కోర్ట్ రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా కొనసాగనుంది. చాలా సెంటర్లలో సెకండ్ వీకెండ్ కి స్క్రీన్లు పెంచుతున్నారు. వచ్చే వారం పెద్ద సినిమాలు క్యూ కట్టిన నేపథ్యంలో ఇప్పుడొచ్చేవన్నీ ఎక్స్ ట్రాడినరి టాక్ తో మెప్పించగలిగితేనే నిలబడతాయి.
This post was last modified on March 20, 2025 3:56 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…