పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత భారతదేశ పురస్కారాలు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సిగలో మరో కలికితురాయి తోడయ్యింది. యుకె పార్లమెంట్ హౌస్ అఫ్ కామన్స్ లో ఆయనకు లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు అందజేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల హాజరులో అక్కడి అధికార లేబర్ పార్టీ ఎంపి నయెందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన నట ప్రస్థానంలో చిరంజీవి చేసిన పాత్రలు, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా యుకె పార్లమెంట్ మెగాస్టార్ కు ఈ అవార్డు అందజేయబోతున్న విషయం కొద్దిరోజుల క్రితమే అఫీషియలయ్యింది.
గత ఏడాది కాలంగా చిరంజీవికి వరస గౌరవాలు దక్కుతున్నాయి. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు వాటిలో మొదటిది కాగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకోవడం గొప్ప ఘనత. 156 సినిమాల్లో 547 పాటల్లో 24 వేల స్టెప్పులు వేసిన యాక్టర్ గా చిరుకి దక్కిన మైలురాయి మామూలుది కాదు. ఐఫా ఈవెంట్ లో అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు సైతం చిరునే వరించింది. 2024లో కొత్త సినిమా ఏదీ విడుదల కాకపోయినా ఈ వరుస గౌరవాలు అభిమానులను ఖుషి చేశాయి. బాక్సాఫీస్ పరంగా ఒక సంవత్సరం రికార్డులు లేకపోయినా అవార్డులు వరించాయి.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కు శుభాకాంక్షలు అందజేస్తూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక అన్నయ్య కంటే తండ్రి సమానుడిగా ఆయన్ను గౌరవిస్తానని, జీవితంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు దిక్సూచిగా నిలిచిన మార్గదర్శిగా చిరుని కొనియాడారు. 3 నంది, 9 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా లక్షలాది మందికి రక్త, నేత్ర దానాలు చేయించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబంతో పాటు ఎందరికో చేయూత ఇచ్చి టాలెంట్ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని చిరంజీవి నిరూపించారని, భవిష్యత్తులో ఇలాంటి పురస్కారాలు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ లో తెలిపారు.
యుకెలో జరిగిన తాజా ప్రధానోత్సవంలో బాబ్ బ్లాక్ మ్యాన్, సోజన్ జోసెఫ్ తదితరులతో పాటు పలువురు భారతీయులు హాజరయ్యారు. వేసవిలో విశ్వంభరతో రాబోతున్న చిరంజీవి ఈ ప్యాన్ ఇండియా మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీజర్ విఎఫ్ఎక్స్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని టీమ్ వాటిని సరిచేసే పనిలో ఉంది. వచ్చే నెల మొదటి ఆడియో సింగల్ తో ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో కన్ఫర్మ్ చేసుకున్న ప్రాజెక్టులు అంచనాలు పెంచుతున్నాయి.
This post was last modified on March 20, 2025 10:31 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…