Movie News

ఎల్2….అసలు కథ ఇక్కడుంది

ఏడేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ సినిమాది విచిత్రమైన కథ. ముందు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. కానీ కంటెంట్ లో విషయముందని గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి ముచ్చటపడి మరీ గాడ్ ఫాదర్ గా రీమేక్ చేయించుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ అనువాద రూపంలో అందుబాటులో ఉన్నా సరే నమ్మకంతో ముందుకెళ్ళిపోయారు. ఫలితం యావరేజ్. కీలక మార్పులు దెబ్బ కొట్టాయని కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడీ లూసిఫర్ కొనసాగింపు ఎల్2 ఎంపురాన్ పేరుతో మార్చి 27 థియేటర్లలో అడుగు పెట్టనుంది.

ఈసారి రీమేక్ గొడవ లేకుండా ఎల్2ని అన్ని భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. నిన్న అర్ధరాత్రి ట్రైలర్ లాంచ్ చేశారు. నాలుగు నిమిషాలకు పది సెకండ్లు తక్కువున్న సుదీర్ఘమైన వీడియోలో కథా కమామీషు చెప్పేశారు. కేరళలో జతిన్ రామదాస్ (టోవినో థామస్) అధికారం చేపట్టాక అతని సవితి అన్నయ్య స్టీఫెన్ అలియాస్ లూసిఫర్ (మోహన్ లాల్) అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారై అరాచకం మొదలవుతుంది. స్టీఫెన్ అసలు పేరైన అబ్రహం ఖురేషి గతం తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఇదంతా సరిదిద్ధేందుకు అతనే ఇండియా వస్తాడు.

దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ చూపించిన యాక్షన్ విజువల్స్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. మొదటి భాగాన్ని మించిన డెప్త్, ఇంటెన్స్, ఎమోషన్స్ పొందుపరిచినట్టు అర్థమైపోయింది. దేశ విదేశాల్లో జరిగిన షూటింగ్, కథలోని కీలక మలుపులు, కొత్తగా తోడైన సీనియర్ ఆర్టిస్టులు అన్నీ ఆసక్తి రేపేలా ఉన్నాయి. దీపక్ దేవ్ సంగీతం ఎలివేషన్ కు బాగా ఉపయోగపడింది. టాలీవుడ్ లో ఎల్ 2 మీద పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ లో చూపించిన స్థాయిలో థియేటర్ కంటెంట్ కూడా ఉంటే మాత్రం మోహన్ లాల్ ఈసారి గురి తప్పకపోవచ్చు. గ్రాండియర్ పరంగా చూసుకుంటే పోటీలో ఉన్న సినిమాల కంటే ఎల్2నే పెద్దది. మలయాళంలో మొదటిసారి ఐమ్యాక్స్ వెర్షన్లో రిలీజవుతున్న సినిమాగా ఎల్2 ఎంపురాన్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

This post was last modified on March 20, 2025 9:07 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వ‌ర్గీక‌ర‌ణ ఓకే.. `వ‌క్ఫ్` మాటేంటి.. బాబుకు ఇబ్బందేనా?

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో కీల‌క‌మైన వ్య‌వ‌హారం క‌త్తిమీద సాముగా మార‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…

10 minutes ago

‘ముంతాజ్’కు మంగళం పాడేసిన చంద్రబాబు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…

11 minutes ago

ఆంధ్రా కింగ్ పాత్రలో సీనియర్ స్టార్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్…

34 minutes ago

తిరుమలలో బాబు ఫ్యామిలీ… అది ట్రెడిషన్ గా మారిందా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం మొత్తాన్ని తీసుకుని శుక్రవారం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని…

38 minutes ago

గ్రోక్‌తో క్షమాపణలు చెప్పించుకున్న దర్శకుడు

గ్రోక్.. గ్రోక్.. గ్రోక్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్…

1 hour ago

50 కోట్ల ఆఫీసర్ ఎలా ఉన్నాడు

గత నెల మళయాలంలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీ సంచలన విజయం సాధించింది. కేవలం పది కోట్ల బడ్జెట్ తో…

2 hours ago