బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్ జయా బచ్చన్ ప్రస్తుతం ఈ లిస్టులో చేరారు. ఇటీవలే ఆవిడ జాతీయ మీడియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ టైటిల్ తనకు అస్సలు నచ్చలేదని, అసలు ఇలాంటి పేర్లు ఉంటే మీలో ఎంత మంది చూస్తారని ప్రశ్నిస్తే నాలుగురైదుగురు మాత్రమే చేతులెత్తారు. దీంతో చూశారా ఇక్కడే ఇలాంటి స్పందన వచ్చిందంటే టాయిలెట్ ఫ్లాప్ అంటూ తీర్పు ఇచ్చేశారు. ఇది కేవలం ప్రచారం కోసం చూసిన చిత్రమంటూ తేల్చి చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
నిజానికి టాయిలెట్ ఎక్ ప్రేమ్ కథ 200 కోట్లకు పైగా వసూలు చేసిన సూపర్ హిట్ మూవీ. గ్రామంలో భార్య పడుతున్న ఇబ్బందిని చూసి ఓ యువకుడు మరుగుదొడ్లను కట్టించేందుకు ఏం చేశాడనే పాయింట్ మీద వినోదాత్మకంగా రూపొందించారు దర్శకుడు శ్రీ నారాయణ సింగ్. స్వచ్ భారత్ ఉద్యమానికి మద్దతుగా నిర్మించిన చిత్రమే అయినా ప్రేక్షకులు ఆదరించారు. అందులో సందేశాన్ని అర్థం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ క్లాసిక్ గా టాయిలెట్ నిలిచింది. అయినా భూమ్మీద ప్రతి మనిషి ఉదయం లేవగానే వెళ్లే ప్రకృతి కార్యక్రమం నిర్వహించే రూముని టైటిల్ గా పెట్టుకుంటే ఇంత ఎగతాళి ఎందుకో మరి.
జయా బచ్చన్ వెర్షన్ మీద అప్పుడే నెటిజెన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకు అభిషేక్ బచ్చన్ స్టార్ కాలేకపోయాడనే అసంతృప్తితో ఆవిడ ఇలా మాట్లాడి ఉండొచ్చని కొందరు అంటుండగా అసలు టాయిలెట్ ని చూసి ఉంటే ఇలా నెగటివ్ గా మాట్లాడే వారు కాదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా పబ్లిక్ డొమైన్, బాక్సాఫీస్ ఆదరించిన సినిమాని ఇలా ఓపెన్ స్టేజి మీద ఫ్లాపని చెప్పడం విచిత్రమే. అయినా తొమ్మిది సంవత్సరాల క్రితం 2019లో రిలీజైన టాయిలెట్ గురించి ఇప్పుడు అదే పనిగా ప్రస్తావించి ఫ్లాప్ అనడం వెనుక పరమార్థం ఏమై ఉంటుందో లోగుట్టు పెరుమాళ్లకెరుక.
This post was last modified on March 19, 2025 7:16 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…