Movie News

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రీచ్ రావడమే కాక యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయి వసూళ్లు కూడా వచ్చాయి. అప్పటి నుంచే హీరోయిన్ మమిత బైజు మనోళ్లకు దగ్గరయ్యింది. తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ అమ్మడికి విజయ్ జన నాయగన్ లో ఛాన్సు దక్కిన సంగతి తెలిసిందే. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రీలీల తరహా కీలక పాత్ర చేస్తోందనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.

తాజాగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మమితనే తీసుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుని సితార ఎంటర్ టైన్మెంట్స్ తెరకెక్కించబోతోంది. రెట్రో రిలీజ్ తర్వాత ఆర్జె బాలాజీతో తన 45వ సినిమా పూర్తి చేశాక సూర్య దీని సెట్లలో అడుగు పెట్టొచ్చని టాక్. వెట్రిమారన్ తో లాక్ చేసుకున్న వాడివాసల్ ఇంకొంచెం ఆలస్యం అయ్యేలా ఉండటంతో ఈలోగా అట్లూరిది పూర్తి చేస్తారని వినికిడి. ముందు సూర్య జోడీగా భాగ్యశ్రీ బోర్సేని అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల మమిత బైజుని తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.

ప్రేమలు సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న మమిత బైజుకు జివి ప్రకాష్ తో చేసిన రెబెల్ డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చింది 2017లో అయినా తొలి బ్రేక్ దక్కడానికి మమితకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. అందుకే దీన్ని కాపాడుకునే క్రమంలో అందరికీ ఎస్ చెప్పడం లేదు. అయితే సూర్య సినిమాలో హీరోయినా లేక జన నాయగన్ తరహాలో ఏదైనా ముఖ్యమైన లీడా అనేది తెలియాల్సి ఉంది. సార్, లక్కీ భాస్కర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాల పరంగా పెద్ద బరువే మోస్తోంది. వేసవిలోనే ప్రారంభించే అవకాశాలున్నాయి.

This post was last modified on March 19, 2025 12:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago