Movie News

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని బాలీవుడ్ రిపోర్ట్. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోమని పురమాయించారట. అయితే ఆ రోజు ఆదివారం. మాములుగా రిలీజులకు అనుకూలంగా ఉండే ఫ్రైడే కాకుండా సండే ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంజాన్ ఉపవాసాలు పూర్తయి నెలవంక వచ్చే అవకాశం ఉన్నది ఆ రోజే కాబట్టి ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చట. కానీ రెండు రోజులు ముందే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అది ఉభయకుశలోపరిగా ఉంటుందనేది మరో వెర్షన్.

ఇప్పటికే సికందర్ మీద ప్రీ నెగటివ్ టాక్ జోరుగా ఉంది. టీజర్, పాటల ప్రోమోల మీద ట్రోలింగ్ జరిగింది. సల్మాన్ లుక్స్ మీద కామెంట్స్ చాలా వచ్చాయి. విఎఫెక్స్ తో డాన్స్ చేయించారని అన్నవాళ్ళు లేకపోలేదు. వీటికి తోడు సాంగ్స్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవనేది ఇంకో ఫీడ్ బ్యాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చి 28 వద్దనుకున్నారేమో టీమ్ కే తెలియాలి. ఎందుకంటే శుక్రవారం వచ్చి టాక్ కొంచెం అటు ఇటు అయితే వీకెండ్ నుంచే దెబ్బ పడుతుంది. అలా కాకుండా సండే వస్తే రిస్క్ తగ్గుతుంది. అయినా కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ రోజైనా ఒకటేగా అనే లాజిక్ మర్చిపోకూడదు.

ఇదిలా ఉంచితే దర్శకుడు మురుగదాస్ కు ఈ సక్సెస్ చాలా కీలకం. గజిని, హాలిడే తర్వాత బాలీవుడ్ లో చాలా గ్యాప్ తీసుకున్నాడు. పైగా సౌత్ లో స్టార్ హీరోలు ఆయన్ని పక్కన పెట్టారు. సికందర్ తో ఋజువు చేసుకుంటే శివ కార్తికేయన్ తో తీస్తున్న మదరాసి మార్కెట్ కు ఉపయోగపడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే లక్కీ గర్ల్ రష్మిక మందన్న హీరోయిన్ కావడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. పాత్ర పరంగా రొటీన్ గానే ఉండొచ్చు కానీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న తన ట్రాక్ రికార్డు దీనికి ఉపయోగపడితే కండల వీరుడికి ప్లస్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సికందర్ డబ్బింగ్ చేస్తారా లేదానేది ఇంకా తేల్చలేదు.

This post was last modified on March 19, 2025 10:09 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago