Movie News

రాబిన్ హుడ్ బిజినెస్ లక్ష్యం పెద్దదే

నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచారు. హీరోతో పాటు శ్రీలీల, వెంకీ కుడుముల యాక్టివ్ గా ఉంటూ పబ్లిసిటీ భారాన్ని ముగ్గురూ తమ భుజాల మీద మోస్తున్నారు. ట్రైలర్ తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరుగుతాయని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ట్రెండ్స్ ని ఫాలో అవుతూ చేస్తున్న మార్కెటింగ్ మంచి ఫలితాన్నే ఇస్తోంది. సోషల్ మీడియాలో దీని తాలూకు వీడియోస్, రీల్స్ వైరలవుతున్నాయి. ఫ్లాపుల తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన నేపథ్యంలో నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

ఇక బిజినెస్ విషయానికి వస్తే రాబిన్ హుడ్ థియేటర్ హక్కులను సుమారు 30 కోట్ల దాకా అమ్మినట్టు ట్రేడ్ టాక్. ఇప్పుడున్న పరిస్థితిలో నితిన్ మీద ఇది పెద్ద మొత్తమే. ఎందుకంటే ఎక్స్ ట్రాడినరి మ్యాన్, మాచర్ల నియోజకవర్గంకు ఇంతకన్నా తక్కువే జరిగింది. అవి పరాజయం పాలైనప్పటికీ రాబిన్ హుడ్ మంచి రేట్ పలకడం విశేషం. మైత్రి బ్రాండ్, నితిన్ ఇమేజ్, శ్రీలీల గ్లామర్, ఫ్లాప్ లేని వెంకీ కుడుముల ట్రాక్ రికార్డు వెరసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాయి. కోస్తా ఆంధ్ర కలిపి 12 కోట్ల దాకా అమ్మగా సీడెడ్ లో మూడున్నర కోట్లకు పైగానే పోయినట్టు సమాచారం. నైజామ్ 10 కోట్లకు పైగానే పలికిందట.

మిగిలింది ఓవర్సీసని చెప్పనక్కర్లేదు. ఈ లెక్కన రాబిన్ హుడ్ కు ఓ రేంజ్ టాక్ రావాలి. కాకపోతే మ్యాడ్ స్క్వేర్ రూపంలో మంచి పోటీనే స్వాగతం పలుకుతోంది. రేంజ్ పరంగా రెండూ ఒకటి కాకపోయినా సితార ప్రొడక్షన్, యూత్ లో మ్యాడ్ కున్న ఫాలోయింగ్ ఓపెనింగ్స్ తేవడం ఖాయం. పైగా ముందు రోజే ప్రీమియర్లు వేసే ఆలోచన కూడా జరుగుతోంది. సో రాబిన్ హుడ్ కు టఫ్ కాంపిటీషన్ తప్పదు. దీంతో పాటు మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్, విక్రమ్ వీరధీర శూరని తక్కువంచనా వేయడానికి లేదు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక క్యామియో చేసిన రాబిన్ హుడ్ కు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

This post was last modified on March 18, 2025 5:22 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

45 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago