వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా తలపడే అవకాశాలున్నాయని టాలీవుడ్ టాక్. ఏప్రిల్ 25 కన్నప్ప భారీ ఎత్తున ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టారు. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు. ప్రభాస్ తో సహా క్యాస్టింగ్ మొత్తం హాజరయ్యేలా విష్ణు ప్లానింగ్ ఒక కొలిక్కి వస్తోంది. దాని మీదే డేట్ ఎప్పుడనేది నిర్ణయిస్తారు. శ్రీ కాళహస్తిలో ఈ వేడుక చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్రతిపాదన. సో రిలీజ్ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు.
ఇక మనోజ్ కీలక పాత్ర పోషించిన భైరవంని ఏప్రిల్ 25నే రిలీజ్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయట. నిజానికది జనవరి లేదా ఫిబ్రవరిలోనే అనుకున్నారు. కానీ సాధ్యపడలేదు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేసిన తెలుగు సినిమా ఇది. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా పెద్ద బడ్జెట్ తో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నిర్మించారు. నారా రోహిత్, మంచు మనోజ్ హీరో స్నేహితులుగా ముఖ్యమైన క్యారెక్టర్స్ దక్కించుకున్నారు. దర్శకుడు శంకర్ కూతురు అదితి దీని ద్వారానే స్ట్రెయిట్ టాలీవుడ్ డెబ్యూ చేస్తోంది. రెండు పాటలు బాగానే రీచ్ తెచ్చుకున్నాయి.
సో అఫీషియలయ్యే దాకా చెప్పలేం కానీ చూస్తుంటే కన్నప్ప వర్సెస్ భైరవం తలపడితే కాంపిటీషన్ ఆసక్తికరంగా మారుతుంది. అయితే కన్నప్ప క్యాస్టింగ్ ని తట్టుకుని మనోజ్ మూవీ నిలుస్తుందా అనేదే పెద్ద ప్రశ్న. భైరవం మీద మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. క్లాస్ మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయని, ఒరిజినల్ వెర్షన్ లో మిస్సయిన కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా జోడించామని చెబుతున్నారు. ఇక ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు లాంటి తారాగణంతో కన్నప్ప మీదున్న హైప్ క్రమంగా పెరుగుతోంది. చూడాలి మరి నిజంగా అన్నదమ్ములు తలపడతారో లేదో.
This post was last modified on March 18, 2025 5:23 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…