గత డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన సారంగపాణి జాతకం ఎట్టకేలకు రిలీజ్ డేట్ దక్కించుకుంది. ఏప్రిల్ 18 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే వచ్చిన కోర్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రియదర్శి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు తర్వాతి సినిమా ఇదే కావడంతో బిజినెస్ పరంగా చాలా హెల్ప్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ ఫన్ ఎంటర్ టైనర్ లో రూపా కొడువయూర్ హీరోయిన్ గా నటించింది. అతి త్వరలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబోతున్నారు.
ఇక్కడ అనుష్క ఘాటీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఏప్రిల్ 18 ముందు లాక్ చేసుకున్నది ఈ ప్యాన్ ఇండియా మూవీనే. యువి క్రియేషన్స్ సంస్థ క్రిష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ లేడీ గ్యాంగ్ స్టర్ డ్రామా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రిలీజ్ ఇంకో నెల రోజులు మాత్రమే ఉన్నప్పటికి ఘాటీ ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోందట. విఎఫెక్స్ పనులతో పాటు రీ రికార్డింగ్ కు ఎక్కువ సమయం అవసరం పడటంతో పోస్ట్ పోన్ చేశారట. వాయిదాని అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు పక్కానే.
ఇక్కడ మరో రెండు విషయాలున్నాయి. యువి టీమ్ ఒకపక్క విశ్వంభరని చూసుకుంటోంది. గ్రాఫిక్స్ టీమ్ ని మార్చడంతో ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టాల్సి వచ్చిందట. ఇంకోవైపు క్రిష్ కి హరిహర వీరమల్లు టీమ్ నుంచి పిలుపు వచ్చిందట. ప్రాజెక్టుని వదిలేసినప్పటికీ అధిక భాగం క్రిష్ డైరెక్ట్ చేసిందే కావడంతో ఎడిటింగ్, ఫైనల్ కాపీ చెకింగ్ లో ఆయన సహకారం కోరినట్టు వినికిడి. ఈ ప్రతిపాదనకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది. నిజమైతే క్రిష్ కు కొంత బ్రేక్ అవసరం. ఏదైతేనేం ఘాటీ వల్ల సారంగపాణికి మేలు జరిగింది. కామెడీ జానర్ కాబట్టి మరోసారి పెద్ద బ్రేకవుతుందని ప్రియదర్శి నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on March 17, 2025 6:03 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…