ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే నెగటివ్ టాక్ బయటికి వచ్చేయడంతో వాస్తవాన్ని అర్థం చేసుకున్న టీమ్ ఆ తర్వాత అనవసర ఆర్భాటాలు, బాణాసంచా కాల్చడాలు లాంటివి చేయకుండా సైలెంట్ అయిపోయింది. కనీసం పది కోట్లయినా వసూలు చేస్తుందనుకుంటే అందులో సగం కూడా తేలేని పరిస్థితి ఉండటంతో దాని ప్రభావం మార్కెట్ మీద ఎంత ఉంటుందనే దాని గురించి తర్వాతి నిర్మాతలు ఆందోళన చెందడం సహజం. నెక్స్ట్ నిర్మాణంలో ఉన్నది కె ర్యాంప్. ఇటీవలే అఫీషియల్ గా ప్రకటించారు.
కేరళ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో మంచి యూత్ ఫుల్ కంటెంట్ తో క్రేజీ రొమాన్స్ కూడా దట్టించారని దీని గురించి ఇన్ సైడ్ టాక్ ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా వెళ్ళలేదు కానీ డిస్కషన్స్ లో ఉన్నవాళ్లు చెప్పిన దాని ప్రకారం ఓ రేంజ్ హాస్యం రాసుకున్నారట. లిప్ లాక్ కిస్సులు వగైరాలు కూడా ఉన్నాయట. అయితే దిల్ రుబా ఫలితం చూసిన కె ర్యాంప్ మరోసారి స్క్రిప్ట్ ని వడబోసి ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో సరిచూసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. ఎంత యూత్ ని టార్గెట్ చేసుకున్నా వాళ్లకు నచ్చే విధంగా నెరేషన్ లేకపోతే ఏమవుతుందో దిల్ రుబా నిరూపించేసింది కాబట్టే ఈ జాగ్రత్త అవసరం.
దర్శకుడిగా జైన్స్ నాని పరిచయమవుతున్న కె ర్యాంప్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత బాధ్యతలు చేతన్ భరద్వాజ్ కు అప్పజెప్పారు. ‘క’తో డబుల్ ప్రాఫిట్ బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ కు ఇప్పుడు దిల్ రుబా ట్రిపుల్ లాస్ వెంచర్ గా మిగలడం అంత ఈజీగా జీర్ణించుకునేది కాదు. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్ మెంట్లు, ఎలివేషన్లు ట్రోలింగ్ కి దారి తీశాయి. కె రాంప్ లో అనుకున్న మాస్ ఎలిమెంట్స్ ని తగ్గించేసి పూర్తిగా ట్రెండీ ఎంటర్ టైన్మెంట్ మీదే దృష్టి పెడతారట. ఇదిలా ఉంచితే కిరణ్ నిర్మాణంలో కొత్త హీరో హీరోయిన్ తో నిర్మించిన మరో యూత్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
This post was last modified on March 17, 2025 4:41 pm
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…