Movie News

కోర్ట్ వసూళ్లు – మూడో రోజు ముప్పేట దాడి

కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్ దాన్ని మించిన విజయంతో ఏకంగా రికార్డులనే టార్గెట్ చేసుకుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆదివారమైన మూడో రోజే ఎక్కువ వసూళ్లు నమోదయ్యాయి. సండే హాలిడేని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ సుమారు 8 కోట్ల 40 లక్షలకు పైగా గ్రాస్ నమోదు చేయడం మాములు విషయం కాదు. మొత్తం వీకెండ్ దాకా వచ్చిన కలెక్షన్లు చూసుకుంటే కోర్ట్ బ్రేక్ ఈవెన్ దాటేయడమే కాక పాతిక కోట్ల గ్రాస్ కు అతి దగ్గరగా వెళ్ళిపోయింది. ఇది పెద్ద మైలురాయి.

ఇదింకా ప్రారంభమే కాబట్టి ఫైనల్ రన్ గురించి అప్పుడే అంచనాకు రాలేం. మార్చి 21 కొత్త రిలీజులు ఉన్నప్పటికీ అవి కోర్ట్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పలేం. చెప్పుకోదగ్గవి లేవు కాబట్టే సలార్ బుకింగ్సే బాగున్నాయి. సో కోర్ట్ కు ఇంకో అవకాశం దొరికినట్టే. సాలిడ్ గా ఈ రన్ కొనసాగితే మాత్రం నలభై కోట్ల వరకు లాగొచ్చని బయ్యర్ల అంచనా. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా దూకుడు మాములుగా లేదు. నిన్న హైదరాబాద్ లో దాదాపు తొంభై శాతం దాకా ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఏ, బి సెంటర్స్ అన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. సి కేంద్రాల్లో మాత్రం కోర్ట్ కొంచెం నెమ్మదిగా ఉంది.

న్యాచురల్ స్టార్ నాని నమ్మకం ఎట్టకేలకు నిలబడింది. మొన్న సక్సెస్ మీట్ లో టీమ్ లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. కోర్ట్ ని ఏకంగా సినిమాటిక్ యునివర్స్ గా చేసే ఆలోచన కూడా నాని బృందంలో జరుగుతోంది. హిట్ సిరీస్ ఎలాగైతే రేంజ్ పెరుగుతూ మూడు భాగాలుగా వచ్చిందో కోర్ట్ ని కూడా అలాగే డెవలప్ చేయాలనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. కాకపోతే ఎంచుకునే కేసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్ట్ రూమ్ డ్రామాలు ప్రతిసారి ఒకే ఫలితాన్ని ఇవ్వవు. డెప్త్, ఎమోషన్స్ ఇవన్నీ సరైన పాళ్ళలో కుదిరితేనే జనం ఆదరిస్తారు. నాని క్యాలికులేటెడ్ గా, పక్కాగా ఉంటాడు కాబట్టి డౌట్ అక్కర్లేదు.

This post was last modified on March 17, 2025 11:04 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మరోమారు పోలీసు కస్టడీకి వల్లభనేని వంశీ

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరోమారు పోలీసు కస్టడీకి సిద్ధం కాక…

14 minutes ago

బాబు దార్శనికతకు అద్దం పట్టిన పవన్ ప్రసంగం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దార్శనికత ఏ పాటితో ఆయా అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలిసి వస్తుంది.…

60 minutes ago

భారీ ప్రైజ్ మనీతో రోహిత్ సేనకు అదిరిపోయే గిఫ్ట్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అజేయంగా విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. కెప్టెన్ రోహిత్…

2 hours ago

‘జాక్’పాట్ కొట్టాలంటే ఇవి దాటాలి

టిల్లు సిరీస్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ చేస్తున్న జాక్ ఏప్రిల్ 10 విడుదల కానుంది. ఇవాళ సాంగ్ లాంచ్ సందర్భంగా…

2 hours ago

టాలీవుడ్ డాన్సుల మీద మహిళా కమిషన్ సీరియస్

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమా పాటల్లో చేస్తున్న నృత్య రీతుల పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా మహిళా…

2 hours ago

భర్తను ముక్కలు చేసిన భార్య.. కూతుర్ని ఉరి తియ్యమంటున్న తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్‌, ఆమె…

2 hours ago