Movie News

‘కోర్ట్’ను కూడా యూనివర్శ్‌గా మారుస్తారా?

తెలుగులో ఫ్రాంఛైజీ చిత్రాలకు ఊపు తెచ్చిన చిత్రం.. హిట్. నాని నిర్మాణంలో శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సక్సెస్ కావడంతో తర్వాత ‘సెకండ్ కేస్’ వచ్చింది. ఇప్పుడు నానినే హీరోగా ‘హిట్-3’ చేస్తున్నాడు. ఇదే స్టయిల్లో ‘కోర్ట్’ సినిమాను కూడా ఫ్రాంఛైజీగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘కోర్ట్’ మూవీని కూడా నానినే నిర్మించిన సంగతి తెలిసిందే. రామ్ జగదీష్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం.. ఈ శుక్రవారమే విడుదలైన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పేరుకున్న చిన్న సినిమానే కానీ దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ వీకెండ్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో ‘కోర్ట్’ను ఫ్రాంఛైజీగా మార్చడంపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్ ఫ్లో చూస్తుంటే.. దీనికి సీక్వెల్ తీయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోందని నాని అన్నాడు. ‘కోర్ట్’ ఇప్పుడు చిన్న సనిమానే కానీ.. సీక్వెల్ అనౌన్స్ చేస్తే మాత్రం అది పాన్ ఇండియా మూవీ అయిపోతుందని, పెద్ద రేంజికి చేరుకుంటుందని నాని అన్నాడు. ‘కోర్ట్’ను కూడా ‘హిట్’ తరహాలోనే యూనివర్శ్‌గా మారిస్తే బాగానే ఉంటుందని.. ఈ రెండు యూనివర్శ్‌ల క్రాస్ ఓవర్ కూడా ప్లాన్ చేయొచ్చని.. దీన్ని తాను మైండ్‌లో పెట్టుకుంటానని నాని అన్నాడు.

నాని మాటల్ని ‘కోర్ట్’ సక్సెస్ ఉత్సాహంలో చెప్పిన సరదా మాటల్లాగా ఏమీ తీసుకోవాల్సిన పని లేదు. ఇలాంటి ఐడియాలను నాని సీరియస్‌గానే ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ‘కోర్ట్’కు సీక్వెల్ అనౌన్స్ చేస్తే కచ్చితంగా దాని హైప్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందేహం లేదు.

This post was last modified on March 16, 2025 7:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Nani

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

14 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago