ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం. తాజాగా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కు ఇంకా వారం ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ షాకిచ్చేలా జరగడం చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఏడాదిన్నర కూడా దాటని సలార్ కు ఈ స్థాయి స్పందన ఊహించనిది. అంటే కల్కి తర్వాత బాగా గ్యాప్ వచ్చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి మీదున్నారు. దీంతో అది తీరే మార్గం లేక సలార్ మీద పడుతున్నారనేది ఓపెన్ సీక్రెట్. అసలైన కిక్ జూలైలో రాబోతోంది. బాహుబలి 1 ది బిగినింగ్ ని పదేళ్ల యానివర్సరీ సందర్భంగా విడుదల చేస్తారట.
నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని డేట్ లేకుండా చూచాయగా చెప్పడంతో మ్యాటర్ అర్థమైపోయింది. టాలీవుడ్ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన సినిమాగా బాహుబలిది ప్రత్యేక స్థానం. రాజమౌళి స్టామినాని ప్రపంచానికి చాటింది కూడా ఈ బ్లాక్ బస్టరే. ఒక లోకల్ మూవీ వందల వేల కోట్లు వసూలు చేయగలవని నిరూపించిన జక్కన్న ఎందరో నిర్మాతలు దర్శకులకు స్ఫూర్తినిచ్చారు. ఒకవేళ బాహుబలి కనక రాకపోయి ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో ప్యాన్ ఇండియా మూవీస్ బడ్జెట్ పరంగా ఇంత రిస్క్ చేసేవి కాదన్నది వాస్తవం. అంతగా ప్రభావం చూపించిన మాస్టర్ పీస్ ఇది.
అధికారికంగా త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది. నిజమైతే మాత్రం రికార్డులు గల్లంతు కావడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు పాతిక వయసుకి అటుఇటుగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలామంది బాహుబలి 1 టైంలో స్కూల్ పిల్లలు. వాళ్లలో చాలా మందికి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఉండకపోవచ్చు. సో బాహుబలిని బిగ్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. ఓటిటి, శాటిలైట్ లో వందల సార్లు వచ్చి ఉండొచ్చు. కానీ క్రాస్ రోడ్స్ సింగల్ స్క్రీన్ లాంటిది లేదా మంచి మల్టీప్లెక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ తో చూస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. పైగా ఎస్ఎస్ఎంబి 29 పుణ్యమాని మహేష్ ఫ్యాన్స్ మద్దతు పుష్కలంగా ఉంటుంది.
This post was last modified on March 16, 2025 4:30 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…