Movie News

ఔను… డేటింగ్ చేస్తున్నా-ఆమిర్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్ల‌యింది. ముందుగా త‌న చిన్న‌నాటి స్నేహితురాలు రీనా ద‌త్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమిర్.. 2002లో ఆమె నుంచి విడిపోయాడు. కొన్నేళ్ల‌కు కిర‌ణ్ రావును పెళ్లాడిన అత‌ను.. ఆమె నుంచి కూడా నాలుగేళ్ల కింద‌ట విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా 60వ ప‌డికి చేరువ అవుతున్న ఆమిర్.. మ‌ళ్లీ పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా ఇటీవ‌ల వార్త‌లు మొద‌ల‌య్యాయి. అత‌ను బెంగ‌ళూరుకు చెందిన ఒక మ‌హిళ‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు రూమ‌ర్లు వినిపించాయి. దీని గురించి తొలిసారిగా ఆమిర్ స్పందించాడు.

తాను డేటింగ్‌లో ఉన్న మాట వాస్త‌వ‌మే అని ఆమిర్ వెల్ల‌డించాడు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఆమిర్.. త‌న వ్య‌క్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యాడు. గౌరీ స్ప్రాట్ అనే బెంగ‌ళూరుకు చెందిన త‌న స్నేహితురాలితో తాను ఏడాదిగా డేటింగ్ చేస్తున్న‌ట్లు ఆమిర్ తెలిపాడు. గౌరీ త‌న‌కు 25 ఏళ్లుగా తెలుస‌ని.. ఆమె త‌న‌కు మంచి స్నేహితురాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమిర్ చెప్పాడు. గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మొత్తానికి ఆమిర్ త‌న కొత్త రిలేష‌న్‌షిప్ గురించి ఓపెన్ అయిపోవ‌డంతో ఇక ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్లే.

త్వ‌ర‌లోనే పెళ్లి వార్త‌తో ఆమిర్ ప‌ల‌క‌రిస్తాడేమో చూడాలి. ఇక త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మ‌హాభార‌తం గురించి ఆమిర్ చెబుతూ.. దీనికి సంబంధించిన రీసెర్చ్ జ‌రుగుతోంద‌ని చెప్పాడు. స్క్రిప్ట్ వ‌ర్క్ కోసం ఒక టీంను ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని.. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు చేయాల‌నుకుంటున్నామ‌ని ఆమిర్ తెలిపాడు. తాము ఎన్నో విష‌యాల‌ను అన్వేషించే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని.. ఏం జ‌రుగుతుందో చూడాలని ఆమిర్ వ్యాఖ్యానించాడు. మ‌రోవైపు మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి సైతం మ‌హాభార‌తం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి రాజ‌మౌళి, ఆమిర్‌ల్లో ఎవ‌రు ఈ మెగా మూవీని ప‌ట్టాలెక్కిస్తారో చూడాలి.

This post was last modified on March 14, 2025 9:02 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

7 hours ago