డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా జాక్ విడుదలకు నెల కూడా లేదు. ఇంకో ఇరవై ఏడు రోజుల్లో జాక్ థియేటర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే బజ్ పరంగా ఆశించిన స్థాయిలో లేదనే టాక్ అభిమానుల మధ్య ఉంది. సిద్ధూకి ఈ మూవీ ఒకరకంగా ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే టిల్లు బ్రాండ్ లేకుండా సోలోగా తన స్టామినా ఏంటనేది దీంతోనే ఋజువు చేసుకోవాలి. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పెద్ద బడ్జెట్ పెట్టారు.
ఇక జాగ్రత్తలని ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం. జాక్ నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ కి మంచి రెస్పాన్సే కనిపిస్తోంది కానీ ఆశించిన స్థాయిలో వైరల్ కాలేదు. అచ్చు రాజమణిని తీసుకోవడంలో ఉద్దేశం ఏదైనా ఆయన అంచనాలను పూర్తిగా అందుకోలేకపోతున్నాడనే కామెంట్స్ ఫాన్స్ నుంచి వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం శ్రీచరణ్ పాకాలను తీసుకున్నారు. కానీ ఇప్పుడాయన స్థానంలో సామ్ సిఎస్ ని లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. పుష్ప 2 ది రూల్, క తర్వాత సామ్ బిజిఎం కోసం డిమాండ్ పెరిగిపోయింది. అందుకే జాక్ కోసం తననే లాక్ చేసినట్టు తెలిసింది. ఇది మంచి పరిణామమే.
ఏప్రిల్ 10 అసలే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పోటీ ఉంది. దానికి తెలుగులో టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ మైత్రి ప్రొడక్షన్ కాబట్టి డబ్బింగ్ అయినా సరే భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తారు. ప్రీ టాక్ పాజిటివ్ గా ఉంది కనక మరీ తక్కువంచనా వేయడానికి లేదు. అదే నిజమైన పక్షంలో జాక్ కి మంచి కాంపిటీషన్ ఉన్నట్టే. అదే రోజు సన్నీ డియోల్ జాత్ వస్తోంది. దీన్ని కూడా తెలుగులో అనువదించి మైత్రినే రిలీజ్ చేస్తోంది. సో పబ్లిసిటీ పరంగా జాక్ నెక్స్ట్ లెవెల్ పబ్లిసిటీ చేస్తేనే ప్రచారపరంగా దూసుకెళ్తుంది. మార్చి మూడో వారం నుంచి సిద్దు జొన్నలగడ్డ స్వయంగా రంగంలోకి దిగబోతున్నాడు. చూద్దాం.
This post was last modified on March 13, 2025 2:04 pm
కోలీవుడ్లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న హీరోల్లో శింబు ఒకడు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు,…
అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన…
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.…
వైసీపీలో నాయకులు చాలా మంది డి-యాక్టివేషన్‌లో ఉన్నారు. కాకలు తీరిన కబుర్లు చెప్పిన నాయకులు కూడా మౌనంగా ఉంటూ.. రమణ…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు .. రాష్ట్ర రాజధాని అమరావతిపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అదేసమయంలో రాజధాని…
ఈసారి ఐపీఎల్ మొదలవుతుండగా.. అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. ఆ జట్టును టైటిల్‌కు హాట్ ఫేవరెట్‌గా పేర్కొన్నారు…