నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత కుర్రాడు తెరమీద కనిపించలేదు. పెద్ద బ్యానర్లు, బడా ఆఫర్లు వచ్చినా ఎందుకో కథల ఎంపికలో జాప్యం చేసుకుంటూ చివరికి ఈ సంవత్సరం రెండు సార్లు దర్శనమివ్వబోతున్నాడు. వాటిలో మొదటిది ఛాంపియన్. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్ పై ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాలో రోషన్ ఫుట్ బల్ ప్లేయర్ గా ఇంటెన్స్ లుక్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా చిన్న టీజర్ వదిలారు.
నలభై సెకండ్ల వీడియోలో కథను రివీల్ చేయలేదు కానీ రోషన్ మేకని పరిచయం చేసిన తీరు అంచనాలు రేపేలా ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఛాంపియన్ కు టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. దీన్ని 2023 లో ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల సకాలంలో పూర్తి కాలేదు. అశ్వినీదత్ లాంటి అగ్ర నిర్మాత బ్యానరే అయినా ఇంత డిలే కావడం అంతు చిక్కనిది. ఎందుకు జరిగిందో తర్వాత బయటికి వస్తుంది కానీ ఛాంపియన్ ని 2025 లోనే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే డేట్ ఇంకా ఖరారు కాలేదు.
ఇది కాకుండా మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభలో రోషన్ నటించాడు. చాలా ప్రాధాన్యం ఉన్నందు వల్లే మలయాళం అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీని షూట్ దాదాపుగా పూర్తయ్యింది. ఇదంతా బాగానే ఉంది కానీ పోటీ ప్రపంచంలో రోషన్ మేక లాంటి కుర్రాళ్ళు పరుగులు పెట్టాలి. హిట్టో ఫ్లాపో వరసగా సినిమాలు చేయాలి. కెరీర్ ప్రారంభంలోనే ఇంత గ్యాప్ తీసుకోవడం సేఫ్ కాదు. మన మీద విపరీతమైన అంచనాలు లేనప్పుడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. దాన్ని వాడుకుంటూ అన్ని జానర్స్ ట్రై చేయాలి. రోషన్ తో పాటే పరిచయమైన శ్రీలీల అతి తక్కువ టైంలో ఎంత దూసుకెళ్ళిందో వేరే చెప్పాలా.
This post was last modified on March 13, 2025 12:24 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…