జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం లేదు. యాభై రోజులు దాటిన తర్వాత కూడా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉండటం చూసి వెంకటేష్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇటీవలే ఈ బ్లాక్ బస్టర్ జీ ఛానల్ లో శాటిలైట్ ప్రీమియర్ జరుపుకున్న సంగత్ తెలిసిందే. తాజాగా వచ్చిన టిఆర్పి రేటింగ్స్ లో సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 15.92 సాధించి ఔరా అనిపించేసింది. హెచ్డి ఛానల్ కు విడిగా వచ్చిన 2.3 కలుపుకుని సగటు తీసుకుంటే ఇది పద్దెనిమిది దాటిపోతుంది.
ఇక్కడ అసలు విశేషం ఏంటంటే చాలా ఏళ్లుగా ఇంత టిఆర్పి సాధించిన సినిమాలు ఏవి లేవు. ఆర్ఆర్ఆర్, కల్కి, హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ సైతం ఇంత రాబట్టుకోలేదు. కారణం స్పష్టం. వెంకీ హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ ని జనం బుల్లితెరపై మరోసారి చూసేందుకు ఎగబడటమే. సమాంతరంగా ఓటిటిలో స్ట్రీమింగ్ చేసినా సరే ఇంత నెంబర్ నమోదు కావడం రికార్డు. ఇదే జీ ఛానల్ గతంలో వచ్చిన శ్రీమంతుడు, వకీల్ సాబ్, డీజే, గీత గోవిందం లాంటివి టాప్ ప్లేస్ లో ఉండగా అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం ఫీట్ చాలా స్పెషల్.
ఇదే తరహాలో ఓటిటిలోనూ వందల మిలియన్ల వ్యూస్ అలవోకగా సాధించిన సంక్రాంతికి వస్తున్నాం ఇకనైనా చల్లారుతుందో లేదో చూడాలి. ఈటీవీ, జెమిని, స్టార్ మాతో పోలిస్తే కొంచెం వెనుకబడినట్టు అనిపించే జీ తెలుగులో ఒక కొత్త సినిమా ఇంతగా రేటింగ్ తెచ్చుకోవడం టీవీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి దిల్ రాజు ఈ సినిమా ఓటిటి డీల్స్ సమయంలో సరైన రేట్ రాక కొంచెం ఇబ్బంది పడ్డారు. బడా కంపెనీలు తటపటాయించాయి. తర్వాత జీ5 ప్రవేశించింది. తీరా చూస్తే పోటీలో ఉన్న ఇతర పండగ చిత్రాలను పక్కకు తోసేసి మరీ మూడు చోట్ల (థియేటర్ – శాటిలైట్ – ఓటిటి) విజేతగా నిలిచింది.
This post was last modified on March 13, 2025 12:10 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…