Movie News

హీరో చివరి చిత్రంలో ముగ్గురు డైరెక్టర్ల క్యామియో?

తమిళంలో సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ను మించే హీరో రాడు అని అందరూ అనుకున్నారు. కానీ గత దశాబ్ద కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్, సినిమాల బిజినెస్, వసూళ్ల పరంగా రజినీని కూడా దాటేసి పైకి వెళ్లిపోయాడు విజయ్. ఐతే కెరీర్ పీక్స్‌ అందుకున్న సమయంలోనే అతను సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుండడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించే విషయమే. అదే సమయంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తుండడం పట్ల వారిలో ఆనందమూ వ్యక్తమవుతోంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ చివరగా విజయ్ నటిస్తున్న చిత్రం.. జననాయగన్.

‘శతురంగ వేట్టై’ దర్శకుడు హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది దసరాకు ‘జననాయగన్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు.విజయ్ కెరీర్లో చివరి చిత్రం కావడంతో దీనికి అనేక ఆకర్షణలు జోడిస్తున్నాడు దర్శకుడు. అందులో భాగంగానే ఓ పాటలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు తళుక్కుమనబోతున్నారట. ఆ ముగ్గురే.. లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్. లోకేష్.. విజయ్‌తో మాస్టర్, లియో లాంటి క్రేజీ సినిమాలు రూపొందించాడు. అట్లీ.. విజయ్‌కి తెరి, మెర్శల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్లు అందించాడు.

ఇక నెల్సన్ విజయ్‌తో తీసిన ‘బీస్ట్’ డిజాస్టర్ అయినప్పటికీ.. ఇద్దరికీ మంచి అనుబంధమే ఉంది. ఈ ముగ్గురినీ ఒక పాటలో చూపించడం అంటే అది కచ్చితంగా విశేషమే. ఇక ఈ సినిమా కథ విషయంలో అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ముందు ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అన్నారు. కానీ తర్వాత ప్రకటించిన టైటిల్ అదీ చూస్తే ఇది ఒరిజినల్ మూవీనే అనిపిస్తోంది. ఈ సనిమా టీజర్ వస్తే కానీ.. ఈ విషయంలో ఒక క్లారిటీ రాదేమో. ఇందులో పూజా హెగ్డే, మామిత బైజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

This post was last modified on March 12, 2025 3:56 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago