Movie News

విశ్వంభర అంత రిస్కు చేయగలదా

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ మూవీ విశ్వంభర విడుదల చిరు పుట్టినరోజు ఆగస్ట్ 22కి ఉండొచ్చన్న వార్త మెల్లగా పాకుతోంది. యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రానప్పటికీ వేసవిలో హరిహర వీరమల్లు ఉంది కాబట్టి మరో మెగా ప్యాన్ ఇండియా మూవీ ఎందుకనే ఉద్దేశంతో పాటు హీరో బర్త్ డే అయితే మంచి సందర్భం అవుతుందనే అభిప్రాయం కొందరు ఫ్యాన్స్ వ్యక్తం చేయడంతో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో యువి క్రియేషన్స్ ఉందని లేటెస్ట్ అప్డేట్. అయితే అంత రిస్క్ నిజంగా తీసుకుంటారా అంటే డౌటే. ఎందుకంటే దానికి పలు కారణాలున్నాయి.

ఆగస్ట్ 14 జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 ఉంది. ఖచ్చితంగా డేట్ మిస్ చేయకూడదనే లక్ష్యంతో యష్ రాజ్ ఫిలింస్ పక్కా ప్లానింగ్ తో ముందెకెళ్తోంది. హృతిక్ గాయం వల్ల బ్రేక్ పడినా సరే ఎలాంటి ఇబ్బంది లేదంటోంది. ఇంకోవైపు రజనీకాంత్ కూలికి కూడా అదే తేదీని చూస్తున్నారు. ఒకవేళ వార్ 2 ఫిక్స్ అయితే వారం రెండు వారాలు ఆలస్యంగా అయినా కూలిని బరిలో దిగుతుందని చెన్నై వర్గాల కథనం. ఇది మాములు మల్టీస్టారర్ కాదు. రజనితో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కాంబో వినగానే హైప్ పెంచుతోంది. తెలుగు వెర్షన్ కే నలభై కోట్ల దాకా రేట్ పలుకుతోందని ఇండస్ట్రీ టాక్.

వీటికి తోడు ఆగస్ట్ 15 ది ఢిల్లీ ఫైల్స్ ని తీసుకొస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా భారీ ఎత్తున రిలీజ్ ఉంటుంది. వీటి మధ్య విశ్వంభర రిస్క్ చేయడం కంటే సోలో డేట్ చూసుకోవడం బెటర్. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు మే 9 బెస్ట్ అయ్యేది. గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి సెంటిమెంట్ కూడా కలిసివచ్చేది. కానీ ఇప్పుడా స్థానంలో వీరమల్లు రావొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్స్ లో ఎవరొస్తారనేది పెద్ద సస్పెన్స్. షూటింగ్ చివరి దశలో ఉండగా ఇంకో పాట షూట్ బాలన్స్ ఉందట. టీజర్ రెస్పాన్స్ చూశాక విఎఫెక్స్ మీద పెడుతున్న ఫోకస్ వల్ల ఆలస్యం పెరుగుతోంది.

This post was last modified on March 11, 2025 8:07 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

3 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

5 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

6 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

6 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

6 hours ago