రాయలసీమ నేపథ్యంలో సినిమాలు అనగానే ఎప్పుడూ కడప-అనంతపురం-కర్నూలు జిల్లాల భాష, యాస, కల్చర్ బ్యాక్ డ్రాప్‌గా తీసుకునేవాళ్లు ఒకప్పటి దర్శకులు. ఫ్యాక్షన్ సినిమాలు అనగానే ఆ మూడు జిల్లాలో ఏదో ఒక దాన్ని నేపథ్యంగా ఎంచుకునేవారు. సీమలో భాగం అయిన చిత్తూరు జిల్లా మీద ఫోకస్ ఉండేది కాదు. కానీ ఈ మధ్య చిత్తూరు నేపథ్యంలో సినిమాలు పెరుగుతున్నాయి. అందుకు ముఖ్య కారణం.. ‘పుష్ప’ అని చెప్పొచ్చు.
ఈ సినిమా పూర్తిగా చిత్తూరు నేపథ్యంలోనే సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో పాటు ‘పుష్ప-2’ సైతం బ్లాక్ బస్టర్ కావడంతో చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌కు క్రేజ్ ఇంకా పెరిగింది. గత కొన్నేళ్లలో వినరో భాగ్యము విష్ణు కథ, హరోం హర, 35.. ఇలా చాలా సినిమాలే చిత్తూరు జిల్లా నేపథ్యంలో తెరకెక్కాయి. ఇప్పుడు ఇంకో క్రేజీ మూవీకి ఈ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్లు సమాచారం.
అక్కినేని అఖిల్ కొత్త చిత్రం చిత్తూరు నేపథ్యంలోనే సాగుతుందట. ఇక్కడ భాష, యాస, కల్చర్‌ను ఈ చిత్రంలో బాగా చూపించబోతున్నారట. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్ర దర్శకుడు మురళీ కృష్ణనే అఖిల్ కొత్త సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. మరోసారి అతను చిత్తూరు జిల్లా నేపథ్యంలో కథ సిద్ధం చేశాడు. అతడి కథ నచ్చి స్వయంగా అఖిల్ తండ్రి నాగార్జునే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఈ నెల 14న ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందట. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్ కావడంతో అఖిల్ ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత అతడి కొత్త చిత్రం సెట్స్ మీదికి వెళ్తోంది. దీని కంటే ముందు యువి క్రియేషన్స్‌లో ఒక సినిమా అనుకున్నారు కానీ.. ఏవో కారణాలతో అది ముందుకు కదల్లేదు.
This post was last modified on March 11, 2025 7:46 pm
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…