ప్యాన్ ఇండియా సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఏంటంటే ఏదైనా ఇబ్బంది వస్తే దాని ప్రభావం పలు రకాలుగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2లో ఇద్దరూ కలిసి చేసే కీలకమైన పాట షూటింగ్ ఇటీవలే ముంబై యష్ రాజ్ స్టూడియోస్ లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని తాలూకు రిహార్సల్స్ జరుగుతుండగా హృతిక్ కాలు బెసగడం వల్ల డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి సూచించారట. 51 వయసులో కుర్రాడిగా నృత్యం చేయడానికి పోటీ పడే హృతిక్ ఈసారి కొంచెం కష్టమైన స్టెప్పులకు సిద్ధమైన తరుణంలో ఇలా జరగడం షాక్ కలిగించే విషయం.
ఇప్పుడీ పరిణామం వల్ల వార్ 2 చివరి పాట చిత్రీకరణ మేకి వాయిదా పడిందని ముంబై రిపోర్ట్. సినిమా విడుదల తేదీ ఆగస్ట్ 14 లో ఎలాంటి మార్పు లేకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీ మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడో చిక్కు ఉంది. వార్ 2 కోసమే తారక్ అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ సెట్స్ లో అడుగు పెట్టలేదు. అతను కూడా హీరో లేని భాగాలతో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టాడు. నీల్ కోసం జూనియర్ ఎన్టీఆర్ మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుంది. వార్ 2 లుక్కుకి దీనికి వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
మొత్తానికి హృతిక్ గాయం పుణ్యమాని వార్ 2కి బ్రేక్ పడటం టెన్షన్ కలిగించేదే అయినప్పటికి రిలీజ్ డేట్ మారడం లేదు కాబట్టి సంతోషించాలి. వేసవి నుంచి యష్ సంస్థ ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రాని యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది స్పెషల్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. కియారా అద్వానీ హీరోయిన్ కాగా తను ఎవరికి జోడి అనేది సస్పెన్స్ గానే ఉంది. హృతిక్ తో కలిసి ఒక పాట విదేశాల్లో షూట్ చేశారు. తారక్ కు ఆర్ఆర్ఆర్ తరహాలో ఒక విదేశీ భామ ఉంటుందని వినిపిస్తోంది కానీ నిర్ధారణగా తెలియాల్సి ఉంది. ఏరియాల వారిగా వార్ 2 తెలుగుకు పెద్ద డిమాండే ఉంది.
This post was last modified on March 10, 2025 7:23 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…