ఇటీవలే విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ తో ది ప్యారడైజ్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారిపోయింది. రెండు జెడలతో నానిని చూపించిన తీరుకి సోషల్ మీడియా షేకయిపోయింది. అందులోనూ ఎప్పుడూ లేనిది ఒక హీరో పాత్రని అంత ఓపెన్ గా ల*** కొడుకుగా చూపించడం మీద పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. ఊహించనంత వయొలెన్స్ ఇందులో ఉంటుందనే లీక్స్ స్క్రిప్ట్ దశలో వినిపించాయి కానీ స్క్రీన్ మీద టెర్రిఫిక్ అనే పదం చిన్నదనిపించేలా విజువల్స్ ఉంటాయని ఆర్ట్ వర్క్ చేసినవాళ్లు చెబుతున్నారు. ఇక క్యాస్టింగ్ గురించి లీకులు ఏదో రూపంలో తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడో ఆసక్తికరమైన పాయింట్ ఉంది.
ఆ మధ్య ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తిని కలిసి ఓ ఫోటో కూడా తీసుకున్నాడు. అయితే అది ఏదో క్యాజువల్ గా కలిసింది కాదని, తన సినిమాలో కీలకమైన పాత్ర ఒకటి ఆఫర్ చేశాడని టాక్ వచ్చింది. నిజానికి నారాయణమూర్తి నలభై ఏళ్ళ క్రితం స్వంత బ్యానర్ ప్రారంభించాక బయట సినిమాల్లో నటించడం మానేశారు. అంతకు ముందు గురువు దాసరి గారి చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్టుగా కనిపించేవారు కానీ అర్ధరాత్రి స్వాతంత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పూర్తిగా మానేశారు. ఎవరు ఎన్ని సార్లు అడిగినా నో చెప్పుకుంటూ విప్లవాత్మక సినిమాలకే కట్టుబడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ లో పోసాని పాత్రను పూరి ముందు అనుకున్నది ఆర్ నారాయణమూర్తినే. బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేశారు. కానీ పెద్దాయన సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కోసం మనసు మార్చుకుంటారా అనేది అనుమానమే. క్యాస్టింగ్ కి సంబంధించి బోలెడు సస్పెన్సులు ఇలాగే ఉండిపోయాయి. అతి ముఖ్యమైన తల్లి పాత్ర ఎవరో ఇంకా బయటికి రాలేదు. రమ్యకృష్ణకి ఆఫర్ చేస్తే నో చెప్పారని నెలల క్రితమే బయటికి వచ్చింది. ప్యారడైజ్ లో గతంలో చూడని షాకింగ్ ఆర్టిస్టుల కాంబినేషన్లు ఉంటాయని తెగ ఊరిస్తున్నారు. హిట్ 3 ది థర్డ్ కేస్ రిలీజయ్యాక మరిన్ని వివరాలు బయటికొస్తాయి.