Movie News

అవతార్ పేరిచ్చింది బాలీవుడ్ హీరోనా

ప్రపంచ చరిత్రలో అత్యుత్తమ సినిమాల గురించి జాబితా రాస్తే టాప్ 10లో ఖచ్చితంగా ఉండే పేరు అవతార్. 2009 లో రిలీజైన ఈ అద్భుత సృష్టి మన దేశంలోనూ భారీ వసూళ్లతో విరుచుకుపడింది. దీని క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో ఎప్పుడూ చూడని ఆకుపచ్చ ప్రపంచంలోకి దర్శకుడు జేమ్స్ క్యామరూన్ తీసుకెళ్లిన తీరు ఎందరో ఫిలిం మేకర్స్ కి ఒక డిక్షనరీ లాంటిది. అలాంటి అవతార్ టైటిల్ ఒక బాలీవుడ్ సీనియర్ హీరో చెప్పాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ గోవిందా ఈ ముచ్చట స్వయంగా పంచుకున్నారు. ముందు ఏమన్నారో చూద్దాం.

“అమెరికాలో ఒక సర్దార్ ని కలిసినప్పుడు ఒక వ్యాపారానికి సంబంధించిన ఐడియా చెప్పా. అది బ్రహ్మాండంగా పనికొచ్చింది. ఆ కృతజ్ఞతతో కొన్ని సంవత్సరాల తర్వాత నాకు జేమ్స్ క్యామరూన్ తో సమావేశం ఏర్పాటు చేశాడు. నేను డిన్నర్ కి పిలిచా. మాటల మధ్యలో అవతార్ పేరు పెట్టుకోమని సూచించా. హీరో వికలాంగుడు కాబట్టి నేను చేయనని చెప్పా. ఒకవేళ ఓకే చెబితే 18 కోట్లు ఇస్తానని అన్నాడు. అంతే కాదు 410 రోజులు కాల్ షీట్స్ ఇవ్వాలని చెప్పాడు. శరీరం మొత్తం పెయింట్ వేసుకోవడం ఇష్టం లేక క్యామరూన్ ఆఫర్ తిరస్కరించా. దేవుడిచ్చిన ఒకే దేహం మీద తొందరపడి ప్రయోగాలు చేయకూడదు”.

చూశారుగా. శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా నిర్వహించిన వీడియో పాడ్ కాస్ట్ లో గోవిందా ఇదంతా చెప్పుకొచ్చారు. వినడానికి బాగానే ఉంది కానీ నమ్మశక్యంగా లేదు. అవతార్ ఇంగ్లీష్ పదం కాదనేది నిజమే అయినా మరీ పెద్దాయన చెబితే పెట్టుకున్నారంటేనే అతిశయోక్తిగా అనిపిస్తుంది. పైగా నటించమని కూడా అడిగారట. ఇక్కడే అసలు డౌట్ కొట్టేది. దీని సంగతి పక్కనపెడితే ముప్పై ఏళ్ళ క్రితం ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో హీరోగా నటించిన గోవిందా సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. ఆంఖే (పోకిరి రాజా), కూలి నెం 1 (చిన్న అల్లుడు), ఖుద్దార్ (ఎస్పి పరశురామ్) లాంటివి అగ్ర హీరోలు చేయడం పలుమార్లు జరిగింది.

This post was last modified on March 10, 2025 5:13 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago