మైనర్లను లోబరుచుకుని వాళ్ళను లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్లకు కఠిన శిక్ష విధించే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం పోక్సో. అయితే దీన్ని దుర్వినియోగపరుస్తూ అమాయకులను బలిచేసినవాళ్లు లేకపోలేదు. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే కేవలం కేసు నమోదైనా చాలు నిజం తేలకముందే నిందితుడి జీవితం నరకప్రాయమవుతుంది. దీన్ని ప్రపంచానికి చూపించే ఉద్దేశంతో దర్శకుడు రామ్ జగదీశ్ చేసిన ప్రయత్నమే కోర్ట్ (స్టేట్ వర్సెస్ ఏ నో బడీ). అభిరుచి కలిగిన సినిమాలు మాత్రమే తీసే ఉద్దేశంతో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ కోర్ట్ డ్రామా మార్చ్ 14 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.
అరటిపండు వలిచినట్టు కథను చెప్పేశారు. ధనవంతుడి కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడో యువకుడు (హర్ష్ రోషన్). వీణ్ణి కట్టడి చేసే ఉద్దేశంతో పిల్ల తండ్రి (శివాజీ) పోక్సో కింద పోలీస్ స్టేషన్ లో కేసు కట్టిస్తాడు. నాన్నకు భయపడిన ఆ యువతి (శ్రీదేవి) మౌనంగా ఉండిపోతుంది. పేదవాడైన ఆ కుర్రాడి కుటుంబం న్యాయం కోసం లాయర్లను కలిస్తే వీళ్ళ తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రారు. కానీ ఓ యువ న్యాయవాది (ప్రియదర్శి) ఎందరు వారిస్తున్నా ధైర్యంగా టేకప్ చేస్తాడు. లొసుగులను దాటుకుని చిక్కులను ఎదురుకుంటూ చివరికి ఎలా న్యాయం చేశాడనేది తెరమీద చూడాలి.
కోర్ట్ డ్రామాలు తెలుగులో ఆడిన దాఖలాలు తక్కువ. వకీల్ సాబ్ హిట్టవ్వడం వెనుక కంటెంట్ కన్నా ఎక్కువ పని చేసింది పవన్ కళ్యాణ్ ఇమేజ్. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడీ కోర్ట్ లో ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా హార్ట్ హిట్టింగ్ డ్రామాని అత్యంత సహజంగా చూపించడంతో స్టోరీ మొత్తం తెలిసినా సరే చూడాలనే ఆసక్తి రేపడంలో దర్శకుడు రామ్ జగదీశ్ సక్సెసయ్యాడు. సాయికుమార్, హర్షవర్షన్, శివాజీ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు విజయ్ బుల్గనిన్ సంగీతం లాంటి టెక్నికల్ సపోర్ట్ కోర్ట్ మీద అంచనాలు పెంచేసింది. కాన్సెప్ట్ కనక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కోర్ట్ రూపంలో ప్రొడ్యూసర్ నానికి హిట్టు పడ్డట్టే.
This post was last modified on March 7, 2025 11:14 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…