ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజయ్యింది. ఉదయం 8 గంటల షోల నుంచే ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో కనిపించింది. అసలు విశేషం ఇది కాదు. ఇలాంటి క్లాస్ సినిమాకు ఏదో మాస్ మసాలా మూవీ రేంజ్ లో హడావిడి చేయడం ఆశ్చర్యపరిచే విషయం. వెంకటేష్, మహేష్ బాబు ఫోన్లో మాట్లాడుకునే సీన్ రీ క్రియేట్ చేయడం, ఇంటర్వెల్ లో చిన్నోడు పూల కుండీని తన్నే సన్నివేశాన్ని స్క్రీన్ దగ్గర చేసి చూపించడం, చిన్నా పెద్ద తేడా లేకుండా పాటలకు డాన్సులు చేయడం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా వీటి తాలూకు వీడియోలు మాములుగా వైరల్ కావడం లేదు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రెండు కోట్ల దాకా గ్రాస్ వచ్చిందంటే అందరూ ఏమో అనుకున్నారు కానీ థియేటర్ రెస్పాన్స్ చూస్తుంటే వీకెండ్ కూడా దీని కంట్రోల్ లోకే వచ్చేలా కనిపిస్తోంది. గత ఇరవై నాలుగు గంటల బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే ఛావా తెలుగు వెర్షన్ సేల్స్ కంటే సీతమ్మ వాకిట్లో అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. మార్నింగ్ షోలు వెంకీ, మహేష్ అభిమానులు నింపేశారనుకున్నా మిగిలిన ఆటలకు వస్తున్నది సామాన్య ప్రేక్షకులు, కుటుంబాలే. పన్నెండేళ్ల క్రితం రిలీజైనప్పుడు ఇలాంటి వాతావరణం ఉందో లేదో కానీ ఇప్పుడొస్తున్న స్పందన నభూతో నభవిష్యత్ అనేలా ఉంది.
మొన్న ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు అన్నట్టు ఇది ఎంజాయ్ చేయడంతో పాటు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఆడియన్స్ ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు, ఏం చేస్తే వాళ్ళను థియేటర్లు వచ్చేలా చేయొచ్చనేది గుర్తించాలి. సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల కోట్ల వెనుక ఉన్న రహస్యం ఇదే. టివి, యూట్యూబ్, ఓటిటిలో ఉచితంగా దొరికే పాత సినిమాని వందలు వేలు పెట్టి మరీ ప్రేక్షకులు టికెట్లు కొని చూస్తున్నారంటే దానర్థం థియేటర్ ఎక్స్ పీరియన్స్ కి ఏదీ సాటి రాదనేగా. వాళ్ళ అంచనాలకు తగ్గట్టు సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఎగబడి చూస్తారు. ఇంతకన్నా ఉదాహరణ వేరే ఏం కావాలి.
This post was last modified on March 7, 2025 1:55 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…