ప్రస్తుతం ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల్లో కియారా అద్వానీ ఒకరు. హిందీతో పాటు తెలుగులోనూ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ ఆమె మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. చివరగా రామ్ చరణ్‌తో ఆమె నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. కియారా మాత్రం తన అందచందాలతో బాగానే మెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్న ‘వార్-2’తో పాటు ‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త చిత్రం ‘టాక్సిక్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీటితో పాటు ‘డాన్-3’ లాంటి మరో క్రేజీ మూవీ కూడా కియారా కమిటైంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘డాన్’, ‘డాన్-2’ చిత్రాలకు కొనసాగింపుగా రానున్న చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు. ఐతే ఈ ప్రాజెక్టు నుంచి కియారా తప్పుకుందన్నది తాజా సమాచారం. రెండేళ్ల కిందట తన ‘షేర్షా’ కోస్టార్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా.. ఇప్పుడు గర్భవతి అయినట్లు సోషల్ మీడియా పోస్ట్ తో కన్ఫర్మ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆమె విశ్రాంతికి పరిమితం కానుంది.
‘డాన్-2’ ఈ ఏడాది ద్వితీయార్దంలో సెట్స్ మీదికి వెళ్లనుంది. అప్పటికి కియారా నిండు గర్భిణిగా ఉంటుంది. అందుకే ఆ సినిమా నుంచి పరస్పర అంగీకారంతో ఆమె బయటికి వచ్చేసింది. ప్రెగ్నెంట్ కావడంతో ఇంకో రెండు మూడేళ్ల పాటు కియారా సినిమాల్లో నటించే అవకాశం లేదు. ‘డాన్-3’ అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ ‘డాన్’కు రీమేక్‌గా 2006లో వచ్చిన ‘డాన్’ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత దాని సీక్వెల్ ‘డాన్-2’ 2011లో రిలీజైంది. కానీ అది సరిగా ఆడలేదు. ఇప్పుడు వీటి దర్శకుడు ఫర్హాన్ అక్తర్.. రణ్వీర్‌తో ‘డాన్-3’ ప్లాన్ చేశాడు. మరి కియారా తప్పుకున్న నేపథ్యంలో ఆమె స్థానంలోకి వచ్చే హీరోయినెవరో చూడాలి.
This post was last modified on March 6, 2025 6:02 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…