భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న నేటివ్ వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ల్లో అత్యంత బోల్డ్ కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇంటిమేట్ సీన్లకు తోడు దారుణమైన బూతులుంటాయి ఈ సిరీస్‌లో. ఐతే ఓ వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న అంశాలు కూడా ఇవే. చాలా నాటుగా సాగే రొమాన్స్, బూతు డైలాగుల్ని యూత్ బాగా ఎంజాయ్ చేశారు.
బేసిగ్గా హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను వేరే భాషల్లో కూడా అనువదించారు. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఏదో మొక్కుబడిగా అనువాదం చేయడం కాకుండా కొంచెం శ్రద్ధ పెట్టే డైలాగులు రాశారు. డబ్బింగ్ చెప్పారు. మామూలుగా హిందీ సినిమాలు, సీరియళ్ల అనువాదంతో పోలిస్తే ‘మీర్జాపూర్’ డబ్బింగ్ మెరుగ్గా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు దీంతో బాగా కనెక్టయ్యారు.
తెలుగు సినిమాల్లో ఎక్కడా వినిపించని బూతులు ‘మీర్జాపూర్’ సిరీస్‌లో విన్నారు ప్రేక్షకులు. ఆ బూతుల కోసమే ఈ సిరీస్ చూసిన వాళ్లూ ఉన్నారు. ఐతే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మీర్జాపూర్’ రెండో సీజన్‌ను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది. ట్రైలర్ హిందీలో వచ్చినపుడే తెలుగు ట్రైలర్ ఏదన్న ప్రశ్నలు అమేజాన్ ప్రైమ్ వాళ్లకు సంధించారు. ఇప్పుడు సిరీస్ రిలీజ్ చేసినపుడు తెలుగు అనువాదమే లేకపోవడంతో వాళ్ల ఫ్రస్టేషన్ మామూలుగా లేదు.
అమేజాన్ ప్రైమ్ ట్విట్టర్ అకౌంట్లో ‘మీర్జాపూర్’ గురించి ఏ పోస్టు పెట్టినా కింద తెలుగు వెర్షన్ ఏదంటూ బూతులు తిడుతున్నారు నెటిజన్లు. వేలాది మంది దీని కోసం డిమాండ్ చేస్తున్నారు. వాళ్లందరూ తెలుగు బూతుల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఆ మెసేజ్‌లు చదివితే అర్థమవుతుంది. బహుశా దానికి సంబంధించి వర్క్ నడుస్తుండొచ్చని, త్వరలోనే తెలుగు ఆడియోను యాడ్ చేస్తారని భావిస్తున్నారుు. దీని గురించి అమేజాన్ ప్రైమ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
This post was last modified on October 26, 2020 6:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…