మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ కొనసాగింపుగా వస్తున్న ఎల్2 ఎంపురాన్ ఈ నెల 27 విడుదలకు రెడీ అవుతోంది. కేరళలో భారీ బిజినెస్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు ఇతర భాషల్లో పోటీ వల్ల చిక్కులు తప్పడం లేదు. ముఖ్యంగా తెలుగు సంగతి చూస్తే మార్చి 28 నితిన్ రాబిన్ హుడ్, సితార మ్యాడ్ స్క్వేర్ ఒకే రోజు వస్తున్నాయి. బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వల్ల రెండింటికి సరిపడా థియేటర్లకు ఇప్పటి నుంచే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇంకోవైపు ఓ రెండు రోజులు అటుఇటు సల్మాన్ ఖాన్ సికందర్ వస్తుంది. దానికి మల్టీప్లెక్సుల కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి.
ఇవి చాలవన్నట్టు విక్రమ్ వీరధీర శూరన్ పార్ట్ 2 అదే మార్చి ఇరవై ఏడున దిగుతోంది. మోహన్ లాల్ తో పోల్చుకుంటే టాలీవుడ్ లో విక్రమ్ కే మార్కెట్ ఎక్కువ. సో ప్రాధమిక మద్దతు చియాన్ కే ఉంటుంది. అయితే ఎల్2 ఎంపురాన్ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ తెలుగు ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ ని తేలిగ్గా తీసుకోవడం లేదట. సలార్, ఎస్ఎస్ఎంబి 29 నటుడిగా తనకు పెరిగిన పాపులారిటీని వాడుకుంటూనే వీలైనంత పబ్లిసిటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. మైత్రి లేదా ఆసియన్ సురేష్ ఎవరో ఒకరు పంపిణి పరంగా సపోర్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం.
ఇవన్నీ ఎలా ఉన్నా ఎల్2కి మన దగ్గర పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే లూసిఫర్ డబ్బింగ్ వెర్షన్ తొలినాళ్లలో ఏపీ, తెలంగాణలో పెద్దగా ఆడలేదు. దాన్నే చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తే యావరేజ్ అయ్యింది. సో ఎల్2 కోసం ఎదురు చూస్తున్న జనాల సంఖ్య తక్కువే. కాకపోతే ట్రైలర్ ని సరిగ్గా కట్ చేసి కనెక్ట్ చేయగలిగితే మాత్రం అంచనాలు పెంచొచ్చు. కానీ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీరధీర శూరన్ చాప్టర్ 2 కాంపిటీషన్ తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. మోహన్ లాల్ గత సినిమా బరోజ్ దారుణంగా డిజాస్టర్ కావడం ఇప్పటి బిజినెస్ మీద కొంత ప్రభావం చూపిస్తున్న అంశాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on March 6, 2025 10:52 am
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…