Movie News

“శ్రీలీల వల్ల ‘ధమాకా’ ఆడడమేంటి?”

మాస్ రాజా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం.. ధమాకా. మిక్స్డ్ టాక్, యావరేజ్ రివ్యూస్‌తో మొదలైన ఈ చిత్రం.. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఐతే టాక్, రివ్యూలు గొప్పగా లేకపోయినా తట్టుకుని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఇందులోని పాటలు, శ్రీలీల గ్లామర్-డ్యాన్సులు ముఖ్య కారణం అనే చర్చ అప్పట్లో జరిగింది. ఇదే మాట ఆ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దగ్గర ప్రస్తావిస్తే అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కేవలం హీరోయిన్ గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమా ఆడేస్తుందా అని అతను ప్రశ్నించాడు.

శ్రీలీల ‘ధమాకా’ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది కదా.. వాటిలోనూ అందంగా కనిపించింది, అదిరిపోయే డ్యాన్సులూ వేసింది.. మరి అవన్నీ హిట్టయ్యాయా అని అతను ప్రశ్నించాడు. ఏ సినిమా అయినా బాగా ఆడిందీ అంటే అందుకు ప్రధాన కారణం కథేనని ప్రసన్న కుమార్ అభిప్రాయపడ్డాడు. ఒక సినిమాలో పాటు మహా అయితే 20 నిమిషాలు ఉంటాయని.. ఆ 20 నిమిషాలు ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ వస్తే సినిమా ఆడేస్తుందా అని అతను ప్రశ్నించాడు. మిగతా రెండు గంటల పాటు కథను ఆసక్తికరంగా నడిపిస్తేనే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారని అతనన్నాడు.

కథ బాగుండి అది సినిమాను డ్రైవ్ చేస్తే.. హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులు లాంటివి బోనస్ అవుతాయని.. సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లడానికి తోడ్పడతాయని ప్రసన్న అభిప్రాయపడ్డాడు. అంతే తప్ప హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులతో ఏ సినిమా ఆడదన్నాడు. ‘ధమాకా’లో ఎంటర్టైన్మెంట్ బాగా కుదిరిందని అతనన్నాడు. ఈ చిత్రంలో ముందు హైపర్ ఆది పాత్రే లేదని.. కానీ తన కామెడీ టైమింగ్ నచ్చి రవితేజ తన మీద కొన్ని సీన్లు రాయమంటే అలా తన పాత్రను యాడ్ చేశామని.. అది బాగా వర్కవుట్ అయిందని ప్రసన్నకుమార్ తెలిపాడు.

This post was last modified on March 5, 2025 5:21 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago