ఇంకా ప్రకటనే రాలేదు. షూటింగ్ మొదలుకాలేదు. కానీ రవితేజ 76 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మాస్ జాతరని పూర్తి చేసే పనిలో ఉన్న మాస్ మహారాజా ఇటీవలే తిరుమల కిషోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది లేటెస్ట్ అప్డేట్. స్టోరీ దాదాపుగా లాకైపోయిందని, ఫైనల్ వెర్షన్ విని ఒక అంగీకారానికి వచ్చాక అగ్రిమెంట్లు ఉంటాయని సమాచారం. అయితే 2026 పండక్కు రిలీజ్ ఉంటుందని ప్రచారంలోకి తేవడం విచిత్రం. అదేదో సామెతలా ఇంకా పెళ్లి కాకుండానే సంతానానికి నామకరణ ముహూర్తం చూసినట్టు ఇంత తొందరపాటు ఎందుకనేది అసలు ప్రశ్న.
గత ఏడాది అచ్చం ఇదే తరహాలో ఈగల్ ని సంక్రాంతికి వదలాలని తెగ ప్రయత్నించారు. అప్పటికే బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ తో పాటు హనుమాన్ ఉండటంతో అనవసరంగా ఓపెనింగ్స్ ని దెబ్బ తీసుకోవడం ఇష్టం లేని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నారు. దీని వల్ల సినిమా హిట్ కాలేదు కానీ పోటీ తగ్గించుకుని సోలోగా రావడం వల్ల కాస్త మెరుగైన రెవిన్యూ దక్కింది. మళ్ళీ ఇప్పుడు అదే వరస రిపీట్ చేస్తారేమో. ఎందుకంటే 2026 సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో రావడం దాదాపు పక్కానే. చిరంజీవి – అనిల్ రావిపూడిది ఆలస్యం లేకుండా వచ్చేస్తుంది.
ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు వస్తారో ఇప్పుడే చెప్పలేం. మాములుగా ఈ సీజన్ కి మాస్ మసాలా సినిమాలు లేదా విజువల్ ఫాంటసీలు వర్కౌట్ అవుతాయి. తిరుమల కిషోర్ కథలు సున్నితంగా ఉంటాయి. ఎంత రవితేజతో తీసేదైనా ఊర మాస్ స్టైల్ లో వెళ్ళలేడు. గతంలో రామ్ రెడ్ తో కొంచెం ట్రై చేశాడు కానీతమిళ రీమేక్ ఫ్లేవర్ వల్ల అది ఆశించిన పెద్ద స్థాయిలో విజయం సాధించలేదు. సో రవితేజతో చేయబోయే జానర్ ఎలాంటిదనేది చెక్ చేసుకోవాలి. అంతే తప్ప ఊరికే రిలీజ్ డేట్ గురించి ఊరించి తర్వాత వాయిదా వేస్తే అభిమానులకు నిరాశ తప్ప ఇంకేం మిగలదు. సో ప్రకటన వచ్చే దాకా వేచి చూడాలి మరి.
This post was last modified on March 4, 2025 5:02 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…