Movie News

కియారా కోసం టాక్సిక్ పరుగులు

హీరోయిన్ కియారా అద్వానీ గర్భం దాల్చిన సంగతి నిన్న అధికారికంగా ఒక చిన్న ఫోటో ద్వారా బయట పెట్టడం చూశాం. ఇలాంటివి ఇంత కన్నా నేరుగా చెప్పలేరు కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సిద్దార్థ్ మల్హోత్రాతో మూడు ముళ్ళు వేయించుకున్నాక మొదటిసారి తల్లి కాబోతున్న కియారా బాలీవుడ్ లో అలియా భట్ తర్వాత మోస్ట్ యంగెస్ట్ మదర్ గా పేరు తెచ్చుకుంటుందని అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రెగ్నెన్సీ ఇంకా ప్రారంభంలోనే ఉంది కాబట్టి ఇంకో రెండు నెలలు షూటింగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే యష్ టాక్సిక్ టీమ్ పరుగులు పెడుతోందట.

కియారా సీన్లు, పాటలు, కాంబినేషన్ సన్నివేశాలు వగైరా వేగంగా పూర్తి చేసే పనిలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఉన్నట్టు బెంగళూరు టాక్. నిజానికి తన పెర్ఫార్మన్స్ నచ్చక యష్ హీరోయిన్ ని మార్చమని చెప్పాడనే పుకారు ఓ రెండు వారాల క్రితం గట్టిగానే చక్కర్లు కొట్టింది. కానీ అందులో నిజం లేదు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు అమెరికా, రాజమండ్రిలో జరిగినప్పుడు కియారా వాటికి దూరంగా ఉంది. కేవలం బిగ్ బాస్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొంది. దానికి కారణం కూడా గర్భం ఖరారయ్యే టైంలోనే అడగటం వల్ల చేయలేకపోయిందని వినిపిస్తోంది. అదెలాగూ ఫ్లాప్ అయ్యింది కాబట్టి తన గైర్హాజరు హైలైట్ కాలేదు.

వార్ 2లోనూ కియారా ఉంది. కాకపోతే తన పోర్షన్లు అయాన్ ముఖర్జీ దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్నా ఆమె పాల్గొనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి డాన్ 3 కోసం రణ్వీర్ సింగ్ కు జోడిగా చేసే ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడ్డట్టే. భరత్ అనే నేనుతో టాలీవుడ్ కు వచ్చిన కియారా రామ్ చరణ్ తో చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ మూటగట్టుకుంది. ఎక్కువగా బాలీవుడ్ కే అంకితమైపోయి ఇప్పుడు తల్లయ్యే క్రమంలో బ్రేక్ తీసుకునే ఉద్దేశంతో ఉందట. ఒకవేళ టాక్సిక్ కనక పార్ట్ 2 ఉంటే మాత్రం ఏడాది తర్వాతే డేట్లు ఇస్తానని చెప్పిందట. దానికింకా చాలా టైం ఉంది.

This post was last modified on March 2, 2025 4:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago