Movie News

“ఓపెన్ హెయిమర్ స్థాయిలో రామాయణం”

ప్రపంచంలోని బెస్ట్ ఫిలిం మేకర్స్ గురించి చెప్పమంటే అందులో ఖచ్చితంగా వినిపించే పేరు క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలు కొందరికి అర్థం కాకపోవచ్చేమో కానీ ఎందరో దర్శకులు రచయితలకు అవి కరదీపికలుగా నిలిచాయి. ప్రేక్షకుల్లో నోలన్ క్లాసిక్స్ కి చాలా పేరుంది. వాటిలో ఓపెన్ హెయిమర్ ఒకటి. తెలుగు డబ్బింగ్ చేయకపోయినా సరే ఏపీ తెలంగాణలో మంచి వసూళ్లు రాబట్టడమే దానికి సాక్ష్యం. ఇటీవలే ఇంటర్ స్టెల్లార్ ని రీ రిలీజ్ చేస్తే అదేదో కొత్త విడుదలన్న రేంజ్ లో ఆడియన్స్ ఎగబడి చూశారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో వారం రోజులు టికెట్లు దొరికితే ఒట్టు.

ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే బాలీవుడ్ రామాయణం నిర్మాత నమిత్ మల్హోత్రా ఓపెన్ హెయిమర్ తోనే తన చిత్రాన్ని పోలుస్తున్నారు కాబట్టి. 2026లో మొదటి భాగం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న ఈ ఇతిహాస గాథ షూటింగ్ రెగ్యులర్ షెడ్యూల్స్ లో జరుపుతూనే ఉన్నారు. మనకు సంబంధించిన కథే అయినప్పటికీ యూనివర్సల్ గా ప్రతి ఒక్కరికి నచ్చే స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఓపెన్ హెయిమర్, ఫారెస్ట్ గంప్ లాగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే స్థాయిలో ఉంటుందని ఊరిస్తున్నారు. బడ్జెట్ పైకి చెప్పడం లేదు కానీ అయిదు వందల కోట్ల పైమాటేనని ముంబై టాక్.

ఆదిపురుష్ లాంటి సినిమాలకు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ టార్గెట్ చేసుకున్న దర్శకుడు నితిష్ తివారి భారతీయ తెరమీద ఇప్పటిదాకా చూడని అనుభూతి కలిగిస్తానని ఊరిస్తున్నారు. సాయిపల్లవి కెరీర్ కి ఇది చాలా కీలకం. హిట్టయ్యిందా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. యానిమల్ లాంటి వయొలెంట్ పాత్ర పోషించక రన్బీర్ కపూర్ కు సైతం రామాయణం ఛాలెంజింగే. రావణుడిగా యష్ మేకోవర్ ప్రధాన ఆకర్షణ కానుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, అరుణ్ గోవిల్ ఇతర తారాగణం.

This post was last modified on March 1, 2025 4:45 pm

Share

Recent Posts

అనిరుధ్ మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ

ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…

52 minutes ago

ఇలాగైతే లోకేష్ ను వైసీపీ ఓడించినట్టే

రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…

56 minutes ago

దసరా బరిలో ఎవరికి ఎక్కువ లాభం

ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…

2 hours ago

ఏఐ సినిమా… ఫోన్లో చూసి మురిసిపోవడమే

మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…

2 hours ago

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

2 hours ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

3 hours ago