నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ‘ప్యారడైజ్’ టీజర్ కోసం తన అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు నానితో ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ముందు నుంచే అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నుంచి ‘రా స్టేట్మెంట్’ పేరుతో ఈ నెల మూడో తారీఖున ఒక రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఎనిమిది భాషల్లో.. అందులోనూ ఇంగ్లిష్, స్పానిష్ లాంగ్వేజెస్‌లోనూ ఈ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో క్యూరియాసిటీ పెరిగింది. ఈ టీజర్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపేలా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం.
టీజర్ చాలా ‘రా’గా ఉంటుందని.. ఘాటైన బూతులు కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘ప్యారడైజ్’ టీజర్లో ఫస్ట్ డైలాగ్‌లోనే ఒక పచ్చి బూతు ఉంటుందని.. అది విని ప్రేక్షకులు షాకైపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ టీజర్లో నాని లుక్ నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుందని.. అది చూసి ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ కావడం ఖాయమని సమాచారం. లుక్ పరంగా ఇప్పటిదాకా ఏ హీరో చేయని సాహసం ఈ సినిమా కోసం నాని చేశాడట.
‘దసరా’లో నానిని నెవర్ బిఫోర్ రగ్డ్ లుక్‌లో చూపించి షాకిచ్చాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడిక ‘ప్యారడైజ్’లో షాక్ ఫ్యాక్టర్ అంతకుమించే ఉంటుందని.. ఈ టీజర్ వచ్చాక సోషల్ మీడియా షేకైపోవడం ఖాయమని చాలా ధీమాగా చెబుతున్నారు టీజర్ చూసిన వాళ్లు. ఈ సినిమాతో నాని వేరే లెవెల్‌కు వెళ్లబోతున్నాడని స్క్రిప్టు గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. ‘దసరా’లో మాస్ చూస్తే.. ‘ప్యారడైజ్’లో ఊర మాస్ చూబోతున్నారని అంటున్నారు. ‘దసరా’ను నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు.
This post was last modified on March 1, 2025 2:51 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…