గత కొంత కాలంగా అజిత్ సినిమాలు యునానిమస్ గా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. వలిమై, తునివుకి తమిళనాడులో పెద్ద నెంబర్లు వచ్చాయి కానీ ఫ్యాన్స్ సైతం వాటి గురించి గర్వంగా చెప్పుకోలేని యావరేజ్ సినిమాలు. ఇక విడాముయార్చి (పట్టుదల) గురించి చెప్పనక్కర్లేదు. మరీ దారుణంగా పోయింది. కేవలం పాతిక రోజులకే ఓటిటి రిలీజ్ అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అజిత్ కు ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్ ని ఇచ్చే బాధ్యత తెలుగు నిర్మాణ సంస్థ తీసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లే టీజర్ ఇవాళ విడుదల చేశారు.
దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ హీరో అజిత్ కు వీరాభిమాని. తన ఫ్యానిజం ఏ స్థాయి ఉందో గుడ్ బ్యాడ్ అగ్లీలో చూపిస్తానని ముందు నుంచి చెబుతూ వచ్చాడు. దానికి తగ్గట్టే నిమిషన్నర వీడియోలో అజిత్ అసలు మాస్ ని బయటికి తెచ్చేశాడు. గ్యాంగ్ స్టార్ డ్రామా అయినప్పటికీ అజిత్ మూడు నాలుగు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. యవకుడితో మొదలుపెట్టి స్టయిలిష్ గా ఉండే వృద్ధుడి దాకా అన్ని వయసులు కవర్ చేసినట్టున్నారు. ఆయన పక్కన సునీల్ కు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, మాస్ మసాలాలు అన్ని కూర్చి అభిమానులను టార్గెట్ చేసుకున్నాడు.
మార్క్ ఆంటోనీ ఛాయలైతే గుడ్ బ్యాడ్ అగ్లీలో కనిపిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ వర్క్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. ఎంత రెగ్యులర్ గా ఉన్నా సరే తమిళనాడులో మాత్రం ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నేసి వేరియేషన్లలో అజిత్ కనిపిస్తే రికార్డులు గల్లంతే. బిల్లా, గ్యాంబ్లర్, రెడ్, వరలారు ఇలా అజిత్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ అన్నీ మిక్సిలో వేసినట్టున్న జిబియు ఏప్రిల్ 10 విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో అడుగు పెట్టనుంది. మైత్రినే నిర్మించిన హిందీ మూవీ సన్నీడియోల్ జాత్ కూడా దీంతో పాటే రిలీజ్ కానుంది.
This post was last modified on February 28, 2025 7:43 pm
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…