ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అబ్బాయిగా ఆది పినిశెట్టి తండ్రి బాటలో నడవకపోయినా నటుడిగా కెరీర్ ని మలుచుకునే ప్రయత్నంలో సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా సరైనోడులో విలన్ గా చేయడం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి లాంటివి నిరాశ కలిగించినా తమిళంలో రెగ్యులర్ వస్తున్న అవకాశాలు బిజీగా ఉంచుతున్నాయి. ఈ క్రమంలో తన కొత్త చిత్రం శబ్దం రేపు రిలీజవుతోంది. నిన్న చెన్నైలో వేసిన స్పెషల్ షోల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ తో పాటు రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర నగరాల్లో రాత్రి ప్రీమియర్లు వేస్తున్నారు.
కంటెంట్ పరంగా శబ్దంలో ప్రత్యేకతలున్నాయి. ఇదో హారర్ థ్రిల్లర్. 2009లో వచ్చిన వైశాలి గుర్తుందిగా. నీళ్లు చేసే హత్యల ఆధారంగా దర్శకుడు అరివజగన్ అరుణాచలం చూపించిన దెయ్యం కథ తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుంది. దానికి తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో అరివజగన్ తీసింది కేవలం నాలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్, శబ్దం కూడా రెండు మూడు వాయిదాల తర్వాత మోక్షం దక్కించుకుంది. వైశాలిలో నీళ్లలాగా శబ్దంలో ధ్వని ద్వారా ప్రతీకారాలు, మర్డర్లు జరుగుతాయి. వాటిని పరిశోధించే సైంటిస్ట్ గా ఆది పినిశెట్టి కనిపిస్తాడు.
బజ్ సంగతి పక్కనపెడితే శబ్దంకు పని చేయాల్సింది మౌత్ టాక్, రివ్యూలే. ఇవి కనక పాజిటివ్ గా ఉంటే ఆది పినిశెట్టి వినిపించాలనుకున్న సౌండ్ ప్రేక్షకుల దాకా చేరుతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే షో చూసిన వాళ్ళ నుంచి వినిపిస్తున్న మాట. ఈ వారంలో రిలీజైన మజాకాకు మిక్స్డ్ టాక్ రావడం శబ్దం ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. ఇటీవలే నాని ముఖ్యఅతిథిగా శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.అఖండ 2లో మెయిన్ విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి అందులో తనను చూసి షాక్ అవుతారని ఊరిస్తున్నాడు.
This post was last modified on February 27, 2025 11:08 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…