ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమాగా హరిహర వీరమల్లు మీద క్రమంగా అంచనాలు ఊపందుకుంటున్నాయి. మూడేళ్ళ నిర్మాణం వల్ల హైప్ కొంచెం తక్కువగా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నా వాళ్ళ ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో విజువల్ గ్రాండియర్ ఉంటుందని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు. ఇప్పటిదాకా రెండు పాటలు వచ్చేశాయి. మాట వినాలి గురుడా మాట వినాలి క్రమంగా ఎక్కుతుండగా, కొల్లగొట్టినాదిరో మాస్ ఆడియన్స్ కి నచ్చేస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ మూవీలో తను పోషిస్తున్న పంచమి పాత్రతో పాటు మరికొన్ని ముచ్చట్లు పంచుకుంది.
ఇంకొక్క పాటకు సంబంధించి కేవలం రెండు రోజుల షూట్ మాత్రమే నిధికి పెండింగ్ ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు మంచి డాన్స్ సీక్వెన్సులు ఇందులో ఉండబోతున్నాయి. వాటికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇంకా వదల్లేదు. గతంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ప్రాక్టీస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇకపై టైం వేస్ట్ చేయడం లాంటివి ఉండవు. వీరమల్లు కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది నిధి అగర్వాల్. పంచమి ఫ్లాట్ క్యారెక్టర్ కాదు. బోలెడు ట్విస్టులు, షేడ్స్, మలుపులు ఉంటాయి. రెండో భాగానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ షూట్ చేయడం అయిపోయింది.
చూశారుగా పంచమి చెప్పుకునే కబుర్లు. మార్చి 28 విడుదల గురించి నిర్మాణ సంస్థ వైపు నుంచి మరోసారి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిధి చెప్పిన అప్డేట్స్ మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తనకు టాలీవుడ్ లో పెద్ద బ్రేక్ దక్కలేదు. అఖిల్ లాంటి స్టార్లతో చేసినా ఫలితం లేకపోయింది. హరిహర వీరమల్లు కోసం ఎక్కువ డేట్లు కేటాయించిన నిధి ఇది ఖచ్చితంగా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇదే ఏడాది ప్రభాస్ తో జోడి కట్టిన ది రాజా సాబ్ విడుదల కానుండటం తనకు మరో మైలురాయి కానుంది. చూడాలి డబుల్ ధమాకా ఎలా ఉండబోతోందో.
This post was last modified on February 25, 2025 9:28 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…