గత దశాబ్ద కాలంలో తెలుగులో సీక్వెల్స్ జోరు బాగా పెరిగింది. ఇదంతా ‘బాహుబలి’ పుణ్యం అని చెప్పాలి. ఇందులో ఒక కథనే రెండు భాగాలుగా చెప్పడం ఒకెత్తయితే.. ఒక కథకు కొనసాగింపుగా ఇంకోటి చేయడం మరో ఎత్తు. గతంలో పెద్ద సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ ప్రకటించేవారు. కానీ ఇప్పుడు చిన్న, మిడ్ రేంజ్ చిత్రాల్లోనూ ఈ ఒరవడి పెరిగింది. సినిమా సక్సెస్ అయ్యాక సీక్వెల్స్ ప్రకటించేవాళ్లు కొందరైతే.. ముందే కాన్ఫిడెంట్‌గా పార్ట్-2 లేదా సీక్వెల్ అనౌన్స్ చేసేవాళ్లు ఇంకొందరు. గత ఏడాది చివర్లో వచ్చిన ‘పుష్ప-2’కు కొనసాగింపుగా ‘పుష్ప-3’ కోసం సినిమాలోనే సుకుమార్ లీడ్ ఇస్తే.. సంక్రాంతి మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’కు సీక్వెల్ ఉంటుందని దాని మేకర్స్ తర్వాత ప్రకటించారు.
ఇప్పుడు మరో కొత్త సినిమా సీక్వెల్ గురించి అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ బుధవారం మహా శివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతున్న కామెడీ మూవీ ‘మజాకా’కు కూడా సీక్వెల్ చేయబోతున్నారట. సినిమాలో దానికి లీడ్ కూడా ఉంటుందట. ‘డబుల్ మజాకా’ పేరుతో ఆల్రెడీ టైటిల్ కూడా ఓకే అయిపోయిందట. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. దీని టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో టీం ‘డబుల్ మజాకా’కు చివర్లో లీడ్ సీన్ పెట్టిందట.
దీన్ని బట్టే మేకర్స్ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తండ్రీ కొడుకులు మాత్రమే ఉండే ఇంట్లోకి ఆడవాళ్లను తీసుకు రావడం అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా నడుస్తుంది. ఓవైపు కొడుకు ఓ అమ్మాయితో, మరోవైపు తండ్రి ఓ నడి వయస్కురాలితో ప్రేమాయణం నడుపుతారు. ఆ ఇద్దరు ఆడవాళ్లు వీళ్లింట్లోకి రావడంతో కథ ముగిసే అవకాశముంది. మరి తర్వాత సీక్వెల్లో కథను ఎలా నడిపిస్తారో చూడాలి. ఐతే సీక్వెల్ పట్టాలెక్కాలంటే ముందు ‘మజాకా’ అనుకున్నంత సక్సెస్ కావాలి. ఈ రోజు లేట్ నైట్ తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్న నేపథ్యంలో ఉదయానికల్లా ఈ విషయమై ఒక అంచనా వచ్చేస్తుంది.
This post was last modified on February 25, 2025 5:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…