న్యాచురల్ స్టార్ నాని ఈసారి పెద్ద ఎత్తున ప్యాన్ ఇండియాని టార్గెట్ చేసుకుని నిర్మించి నటించిన సినిమా హిట్ 3 ది థర్డ్ కేస్. నిన్న వదిలిన టీజర్ లో ఊహించని స్థాయిలో వయొలెన్స్ ఉండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. హింస, ఎలివేషన్లు ఇప్పుడొక సక్సెస్ ఫార్ములాగా మారిపోయిన తరుణంలో దర్శకుడు శైలేష్ కొలను వాటిని సరైన మోతాదులో దట్టించిన వైనం విజువల్స్ లో కనిపించింది. దసరాతోనే హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసుకున్న నాని అది తెలుగులో బ్లాక్ బస్టరైనా హిందీలో ఆ కోరికను తీర్చుకోలేకపోయాడు. ఇప్పుడు హిట్ 3 ది థర్డ్ కేస్ తో అది నెరవేరే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
హిట్ 3 రిలీజవుతున్న మే 1న సూర్య రెట్రో వస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కంగువ పోయినా సరే ఫ్యాన్స్ ఈసారి సూర్య కంబ్యాక్ ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే టీజర్ తో హైప్ వచ్చింది. ఇది కూడా తమిళ తెలుగుతో ఇతర భాషల్లో సమాంతరంగా రిలీజ్ చేస్తున్నారు. కాకతాళీయంగా రెట్రోలో కూడా హింస గట్టిగానే ఉందట. హిట్ 3 చూపించినంత స్థాయిలో కాకపోవచ్చు కానీ ఫైట్లు, ఎలివేషన్, యాక్షన్ ఎపిసోడ్లు దేనికవే పోటీ పడేలా ఉంటాయని చెన్నై టాక్. సో ఎంత లేదనుకున్నా పోలికలు ఖచ్చితంగా వస్తాయి.
బలాబలాల విషయానికి వస్తే ట్రాక్ రికార్డు ప్రకారం నాని ముందంజలో ఉన్నాడు. అందులోనూ హిట్ 3 కేవలం ఏదో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ తరహాలో కాకుండా కాశ్మీర్ కు వెళ్లి విభిన్న బ్యాక్ డ్రాప్ ని సెట్ చేసుకున్నారు. చాలా రిస్కీ లొకేషన్లలో షూట్ జరిగింది. రెట్రోకు సైతం సూర్య చాలా కష్టపడ్డాడు. రెండు మూడు షేడ్స్ లో కనిపిస్తాడు. కాకపోతే బాషా తరహాలో ట్రీట్ మెంట్ ఉంటుందనే టాక్ నేపథ్యంలో అది నిజమైతే మాత్రం హిట్ 3కి అడ్వాంటేజ్ గా మారుతుంది. దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా రెట్రోకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చూడాలి మరి పోటీ ఎలా ఉంటుందో.
This post was last modified on February 25, 2025 1:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…