మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న హరిహర వీరమల్లు రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పాటను ఆస్కార్ విజేతలు కీరవాణి స్వరపరచగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. ట్యూన్ క్యాచీగా ఉంది. అయితే ఇది ఇప్పుడు చిత్రీకరించింది కాదని పవన్ లుక్స్ చూస్తే అర్థమైపోతుంది. అనసూయ, నిధి అగర్వాల్, పూజిత పొన్నాడలు సైతం ఆశ్చర్యపోయేలా కనిపించారు. జానపద స్టైల్ లో బీట్స్ మిక్స్ చేస్తూ కంపోజ్ చేసిన విధానం క్రమంగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా వీరమల్లుగా పవన్ వేషధారణ చాలా కాలంగా ఆకలితో ఉన్న అభిమానులకు సంతోషం కలిగించేలా ఉంది.
ఏళ్ళ తరబడి శ్రమకు ఫలితం దక్కే క్షణాలు వచ్చాయని నిధి అగర్వాల్ ట్వీట్ చేయడం గమనార్హం. బజ్ విషయంలో పోరాడుతున్న హరిహర వీరమల్లుకి ఇప్పుడు చేయబోయే ప్రతి ప్రమోషన్ చాలా కీలకం. మార్చి 28 విడుదల గురించి వీడియో చివర్లో లేకపోవడం కొంత అనుమానం రేకెత్తించేలా ఉన్నా బయటికిస్తున్న సమాచారంలో మాత్రం రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని టీమ్ నొక్కి వక్కాణిస్తోంది. సాంగ్ పోస్టర్ లో కూడా మార్చ్ 28 అలానే ఉండడంతో రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ ఆల్బమ్ కున్న మరో ప్రత్యేకత మొదటిసారి పవన్ కళ్యాణ్ – కీరవాణి కలయిక జరగడం. పాతిక సినిమాలకు పైగా ప్రయాణంలో ఈ మెగా పవర్ కాంబో కుదరకపోవడం ఆశ్చర్యమే.
సో ఈ పాట రీచ్ ఏ స్థాయిలో ఉంటుందనేది ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. సోషల్ మీడియాని ప్రామాణికంగా చూసుకుంటే రీల్స్, రీమిక్స్, ట్వీట్లు, పోస్టులు ఎన్ని వేలు లక్షల్లో వస్తాయనే దాన్ని బట్టి ఛార్ట్ బస్టర్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. ఇక పబ్లిసిటీలో కీలకమైన ట్రైలర్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. క్రిష్ అధిక భాగం, మిగిలింది జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ డ్రామాలో మొదటి భాగం స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది విడుదల కానుండగా రెండో భాగం ఓజి తర్వాతా లేక అంతకన్నా ముందా అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
This post was last modified on February 24, 2025 6:12 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…