హిమాలయాల్లో వైల్డ్డాగ్ షూటింగ్‍కి వెళ్లిన నాగార్జున మూడు వారాల పాటు అక్కడ్నుంచి రాలేనని, పూర్తిగా అవుటాఫ్ రీచ్ వెళ్లిపోతానని వీడియో ద్వారా చెప్పేసారు. ప్రతి శనివారం బిగ్‍బాస్ సెట్స్కి వెళ్లి శని, ఆదివారాల ఎపిసోడ్స్ హోస్ట్ చేసే నాగార్జున మూడు వారాలు అందుబాటులో లేకపోతే మరి ఆ షోని హోస్ట్ చేసేదెవరు? గత సీజన్లో నాగార్జున ఇలాగే ఆబ్సెంట్ అయితే ఆ వారం రమ్యకృష్ణ హోస్ట్ చేసారు. ఈసారి ఆ బాధ్యతలను కోడలు సమంతకు అప్పగించారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్స్ ఏమీ లేకుండా ఇంట్లోనే వుంటోన్న సమంత ఈ షోని హోస్ట్ చేయడానికి అంగీకరించడంతో ఆల్రెడీ ఈ వీకెండ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్‍లో చేస్తున్నారు. రమ్యకృష్ణ మినహా బిగ్‍బాస్ షోని దేశవ్యాప్తంగా ఇంతవరకు లేడీ ఎవరూ హోస్ట్ చేయలేదు. యంగ్ సమంత వచ్చి తనదైన శైలిలో ఈ షో హోస్ట్ చేస్తే ఎలా వుంటుందనేది ఆసక్తికరమే. అయితే మూడు వారాల పాటు సమంతే హోస్ట్ చేస్తుందా లేక వారానికో హోస్ట్ వుంటారా అనేది తెలియదింకా.
బిగ్‍బాస్ లాంటి ప్రతిష్టాత్మక షోకి ఇలా హోస్ట్ మిస్ అవడం వల్ల కన్సిస్టెన్సీ దెబ్బ తింటుంది. కానీ స్టార్ మా అధిపతులలో నాగార్జున కూడా ఒకరు కనుక ఆయన బిజీగా వున్నపుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్లు తప్పడం లేదు. సీజన్ మొదలు కాకముందే వైల్డ్డాగ్ షూట్ నిమిత్తం కొన్ని రోజుల పాటు అందుబాటులో వుండనని నాగార్జున చెప్పేసారట.
This post was last modified on October 24, 2020 5:07 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…