ఎల్లుండి విడుదల కాబోతున్న మజాకా మీద అంచనాలు బాగానే నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో వెరైటీగా ఏవో ప్రమోషన్లు చేయబోయారు కానీ అవంత వర్కౌట్ కాలేదని సోషల్ మీడియా స్పందన చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ వచ్చాక హైప్ మారింది. ధమాకా తరహాలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మరోసారి వినోదాన్ని నమ్ముకున్న వైనం స్పష్టమయ్యింది. సందీప్ కిషన్ తో సమానంగా రావు రమేష్ పాత్రను డిజైన్ చేయడం చూస్తే తండ్రి కొడుకుల కామెడీని రచయిత ప్రసన్నకుమార్ గట్టిగానే దట్టించినట్టు కనిపిస్తోంది. బాక్సాఫీస్ డ్రైగా ఉన్న తరుణంలో మజాకా నిజమైన తడాకాని చూపించాల్సి ఉంటుంది.
ఎందుకంటే సుమారు తొమ్మిది కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ టాక్. ఇది మరీ భారీ మొత్తం కాదు కానీ సందీప్ కిషన్ ఇమేజ్ కి అంత సులభమూ కాదు. కాకపోతే అదిరిపోయిందనే టాక్ వస్తే వారం లోపే సులభంగా రికవరీ అవ్వొచ్చు. యావరేజ్ అనిపించుకున్నా చాలు పది పదిహేను రోజుల్లో లాంఛనం అయిపోతుంది. కానీ ఆడియన్స్ ఈ కంటెంట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కీలకం. అసలే ఫిబ్రవరి ఒకరకంగా నాన్ సీజన్ లాంటిది. పిల్లల పరీక్షల మూడ్ లో పెద్దలు కూడా థియేటర్లకు దూరంగా ఉన్నారు. తండేల్ ఈ కారణంగానే వంద కోట్లకు దగ్గరగా ఉన్నప్పుడే స్లో అయిపోయింది.
తర్వాత వచ్చినవేవి పెద్దగా నిలబడలేదు. ఒక్క రిటర్న్ అఫ్ ది డ్రాగన్ మాత్రమే యూత్ ని ఆకట్టుకుంటూ వసూళ్లు బాగానే రాబడుతోంది. కానీ మజాకాకు స్ట్రెయిట్ మూవీగా పెద్ద బాధ్యత ఉంది. ఎలాగూ ఇంకో వారం రెండు వారాల వరకు చెప్పుకోదగ్గ రిలీజ్ లేదు. సో బాగుందనే మాట వినిపిస్తే మాత్రం సందీప్ కిషన్ కెరీర్ లోనే పెద్ద నెంబర్లు నమోదు చేయొచ్చు. పాటలు బాగానే ఉన్నప్పటికీ ఛార్ట్ బస్టర్స్ అయ్యే రేంజ్ లో అనిపించకపోవడం కొంత లోటే అనిపిస్తున్నా తెరమీదకొచ్చాక మరింత బెటర్ గా అనిపిస్తాయేమో చూడాలి. రీతూ వర్మ రూటు మార్చి కమర్షియల్ హీరోయిన్ కావడం మజాకాకున్న మరో ఆకర్షణ.
This post was last modified on February 24, 2025 1:53 pm
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…