న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 1, హిట్ 2 ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. విశ్వక్ సేన్, అడవి శేష్ కు మంచి బ్రేక్ గా నిలిచిన ఈ సిరీస్ లో మూడో కేస్ నాని స్వయంగా టేకప్ చేయడంతో ప్రాజెక్టు ముందు నుంచి దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మే 1 విడుదల కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ గతంలో ఎప్పుడూ చూడనంత వయొలెన్స్ ఉంటుందని టీమ్ అప్పుడప్పుడు చెబుతూనే వచ్చింది అది ఎంత మోతాదులో ఉందో ఇవాళ శాంపిల్ రూపంలో చూపించారు. ఊహించని షాకులు బోలెడిచ్చారు.
ఎక్కడో కాశ్మీర్ దగ్గరలో ఒక సుదూర ప్రాంతాలు. చాలా దారుణమైన కొన్ని హత్యలు జరుగుతాయి. ఎవరు చేస్తున్నారో అర్థం కాక దీన్ని పరిష్కరించేందుకు అర్జున్ సర్కార్ (నాని) ని పిలిపిస్తారు. లాఠీనే ఆయుధంగా చేసుకునే అర్జున్ కి జాలిదయా ఉండవు. తప్పు చేసిన వాడు, నేరస్థుడు దొరికితే చాలు ఎందుకు మనిషి జన్మ ఎత్తామా అనిపించేలా చితకబాది రక్తం బయటికి తీస్తాడు. అలాంటి పోలీస్ ఆఫీసర్ కు సీరియల్ మర్డర్స్ కేస్ సవాల్ గా మారుతుంది. అప్పటిదాకా చేసిన ఆపరేషన్లకు భిన్నంగా దీనికి ఇంకా వయొలెంట్ మోడ్ లోకి వెళ్లాల్సి వస్తుంది. అసలు ఇంతకీ ఇదంతా చేసింది ఎవరనేది అసలు స్టోరీ.
దసరా చాలా తక్కువనిపించే స్థాయిలో హిట్ 3 విజువల్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. ముఖ్యంగా నాని లాఠీ పట్టుకుని విరుచుకుపడే తీరు, విలన్ల ఊచకోత కోసే వైనం సెన్సార్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ తెస్తుందో చూడాలి. ఊర మాస్ పోలీస్ గా నాని టెర్రిఫిక్ గా ఉన్నాడు. రావు రమేష్ లాంటి ఒకరిద్దరిని తప్ప క్యాస్టింగ్ ని రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు. మిక్కీ జె మేయర్ బీజీఎమ్ ఎలివేటయ్యింది. మొత్తానికి హిట్ 3 ది థర్డ్ కేస్ ఆషామాషీగా ఉండదని మాత్రం అర్థమైపోయింది. బడ్జెట్ పరంగానూ పెద్ద స్కేల్ కనిపిస్తోంది. మోస్ట్ వయొలెంట్ నానిని చూసేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోవచ్చు.
This post was last modified on February 24, 2025 11:29 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…