టాలీవుడ్లో చాలామంది హీరోలకు వాళ్ల పేర్ల వెనుక బిరుదులున్నాయి. కొందరు హీరోలకు అభిమానులు ప్రేమతో ఈ బిరుదులిచ్చుకుంటే ఇచ్చుకుంటే.. కొందరేమో సొంతంగా వాళ్లకు వాళ్లే ఏదో ఒక ‘స్టార్’ అని తగిలించేసుకున్నారు. కొందరు హీరోల విషయంలో దర్శక నిర్మాతలు ఒత్తిడి చేసి పేరు వెనుక ఏదో ఒక ‘స్టార్’ అని వేస్తుంటారు. ఐతే ఒకరికి ఉన్న బిరుదును ఇంకొకరు వాడుకోవడం అరుదు. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత అదే బిరుదు మహేష్ బాబుకు వచ్చింది. అక్కినేని అభిమానుల్లో కొందరు ఒకప్పటి నాగార్జున బిరుదు ‘యువ సామ్రాట్’ను నాగచైతన్యకు వాడుతుంటారు.
ఐతే ఎవ్వరూ ఊహించని విధంగా ‘పీపుల్ స్టార్’ అనే నారాయణ మూర్తి బిరుదును యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఉపయోగించుకోడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నారాయణమూర్తి ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోవచ్చు. కానీ విప్లవ సినిమాలతో ఆయన తెచ్చుకున్న పేరును.. యూత్ ఫుల్ మూవీస్ చేసే సందీప్ కిషన్ పెట్టుకోవడం చిత్రంగా అనిపించింది. ఐతే తన పేరు వెనుక ‘పీపుల్స్ స్టార్’ అని రావడం వెనుక కారణమేంటో సందీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘రాయన్ సినిమాలో నటించాక నాకు ఫ్యాన్స్ పెరిగారు. ఒక అభిమాన సమూహం బయటికి వచ్చింది. వాళ్లు నా గురించి రీల్స్ చేయడం చూసి నిర్మాత అనిల్ సుంకర ‘పీపుల్స్ స్టార్’ అని పెట్టుకోమని సలహా ఇచ్చారు. అదే పోస్టర్ మీద వేశారు’’ అని సందీప్ తెలిపాడు. ఇక గత కొన్నేళ్లలో ఆశించిన విజయాలు అందుకోలేకపోవడం గురించి, కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లకపోవడం గురించి సందీప్‌ను అడిగితే.. ‘‘గత ఆరేళ్లలో నా మార్కెట్ చాలా పెరిగింది. ‘నిను వీడని నీడను నేనే’ నుంచి ‘మజాకా’ వరకు చూస్తే బడ్జెట్, మార్కెట్ 12 రెట్లు అయ్యాయి.
ఏమీ లేని రోజునే పోరాడి ఇంత వరకు వచ్చాను. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడం ఇంకా సులభం అన్నది నా అభిప్రాయం’’ అని సందీప్ తెలిపాడు. సందీప్ కొత్త చిత్రం ‘మజాకా’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 23, 2025 11:44 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…