Movie News

కుబేర మౌనం పట్ల అభిమానుల ఆందోళన

సార్ తర్వాత ధనుష్ చేస్తున్న తెలుగు సినిమా కుబేర ఎప్పుడు రిలీజవుతుందో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజవుతున్నారు. నాగ చైతన్య తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేశాక ఇప్పుడు నాగార్జున కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కుబేర ఆ లోటు తీరుస్తుందని వాళ్ళ నమ్మకం. అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే వ్యక్తి. అంత సులభంగా రాజీ పడరు. ఈ కారణంగానే లేట్ అవుతోందనే కామెంట్స్ ముందు నుంచి ఉన్నాయి. ఇంకోపక్క ధనుష్ కుబేర సంగతి ఏమో కానీ తనే హీరోగా ఇడ్లి కడాయ్ స్వీయ దర్శకత్వంలో పూర్తి చేసుకుని బాలీవుడ్ మూవీ తేరి మేరీ ఇష్క్ మేలో బిజీ అయిపోయాడు.

ఇదిలా ఉండగా కుబేర టైటిల్ మాదంటూ నరేందర్ అనే నిర్మాత నిన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వివాదం రేపడం హాట్ టాపిక్ అయ్యింది. 2023లోనే తాము రిజిస్టర్ చేసుకున్నామని ఆయన వాదన. గతంలో ఇదే సమస్య నాని గ్యాంగ్ లీడర్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కుబేరకు కూడా అలాంటి పరిష్కారం ఏదో ఒకటి చూస్తారు కానీ కీలకమైన వేసవి సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ లో ఆందోళన రేపుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన కుబేరలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించడం మరో ప్రధాన ఆకర్షణ.

మార్చ్ లో ఛాన్స్ లేదు. ఏప్రిల్ స్లాట్స్ ఫుల్ అయిపోయాయి. జాక్, ఘాటీ, గుడ్ బ్యాడ్ అగ్లీ, కన్నప్ప ఇలా ప్యాన్ ఇండియా సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఒకవేళ మే అనుకున్నా అదేదో ఇప్పుడే ప్రకటిస్తే బెటర్. తిరిగి జూన్ లో చిరంజీవి విశ్వంభర, రవితేజ మాస్ జాతర లాంటివి వెయిట్ చేస్తుంటాయి. సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న కుబేర ఇంత లేట్ చేయడం విచిత్రమే. డబ్బు నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాని ఎంచుకునే శేఖర్ కమ్ముల ట్రీట్ మెంట్ ఈసారి చాలా కొత్తగా ఉంటుందట. దీని తర్వాత న్యాచురల్ స్టార్ నానితో చేసే ప్లాన్ లో ఉన్నారు కమ్ముల. కాకపోతే ప్రస్తుతానికి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు.

This post was last modified on February 23, 2025 11:33 am

Share

Recent Posts

ట్రాఫిక్ చలాన్… కరెంట్ బిల్లుతో వసూలు చేస్తారా?

ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…

3 hours ago

అనిరుధ్ మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ

ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…

4 hours ago

ఇలాగైతే లోకేష్ ను వైసీపీ ఓడించినట్టే

రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…

4 hours ago

దసరా బరిలో ఎవరికి ఎక్కువ లాభం

ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…

4 hours ago

ఏఐ సినిమా… ఫోన్లో చూసి మురిసిపోవడమే

మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…

5 hours ago

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

5 hours ago