లేటు వయసులో మంచి స్పీడుతో సినిమాలు చేసుకుపోతన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్.. లాల్ సలామ్.. వేట్టయాన్.. ఇలా 15 నెలల వ్యవధిలో ఆయన్నుంచి మూడు సినిమాలు వచ్చాయి. చివరగా గత ఏడాది అక్టోబరులో ‘వేట్టయాన్’తో పలకరించిన సూపర్ స్టార్.. ఈ వేసవి చివర్లో ‘కూలీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉండగా.. ఆల్రెడీ తర్వాతి చిత్రం ‘జైలర్-2’ను పట్టాలెక్కించేస్తున్నారు. దీని తర్వాత రజినీ చేయబోయే సినిమా గురించి ఆసక్తికర ప్రచారాలు జరుగుతున్నాయి.
తాజాగా విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రజినీతో అతను కథా చర్చలు జరుపుతున్నాడని.. బేసిక్ లైన్ చెప్పి ఒక స్క్రిప్టు మీద పని చేస్తున్నాడని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. ఐతే ఈ అప్‌డేట్ రజినీ అభిమానులు ఏమంత ఎగ్జైట్ చేయట్లేదు. వెట్రిమారన్ ప్రస్తుతం తమిళంలో ఉన్న బెస్ట్ డైరెక్టర్లలో ఒకడనడంలో సందేహం లేదు. కానీ అతడి సినిమాలకు క్రిటికల్ అక్లైమ్ వస్తుంది కానీ.. కమర్షియల్‌గా ఒక స్థాయికి మించి ఆడవు. అందులోనూ చివరి చిత్రం ‘విడుదల-2’ అయితే పూర్తిగా నిరాశపరిచింది.
వెట్రిమారన్ శైలి ప్రకారం చూస్తే రజినీకి సెట్ కాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రజినీ కమర్షియల్ టచ్ లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తే సరైన ఫలితం ఉండదన్నది వారి వాదన. అందుకు ‘వేట్టయాన్’ లాంటి సినిమాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. వేట్టయాన్ క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకున్నప్పటికీ సరిగా ఆడలేదు. రజినీ సినిమాల్లో కమర్షియల్ టచ్ ఉంటేనే బాగా ఆడతాయని.. ‘జైలర్’ లాంటి సినిమాలే అందుకు రుజువని.. కాబట్టి సూపర్ స్టార్ వెట్రిమారన్ లాంటి దర్శకులతో సినిమాలు చేయకపోవడం మంచిదనే అభిప్రాయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on February 23, 2025 9:04 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…